POCO F7 5G పై రూ. 4,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

Updated on 27-Oct-2025
HIGHLIGHTS

POCO F7 5G పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 4,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది

ఈ పోకో పవర్ ఫుల్ ఫోన్ కేవలం 27 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది

ఈ ఫోన్ పై ఇంత భారీ డీల్స్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది

POCO F7 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ సేల్ తర్వాత ఈ ఫోన్ పై ఇంత భారీ డీల్స్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ పోకో పవర్ ఫుల్ ఫోన్ కేవలం 27 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

POCO F7 5G : ఫ్లిప్ కార్ట్ ఆఫర్

పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 31,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు కూడా ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఈరోజు ప్రకటించింది. అవేమిటంటే, ఒకటి ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రెండవది రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. సెలెక్టెడ్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు పై ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Sony Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

POCO F7 5G : ఫీచర్స్

పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ 2.1Mn AnTuTu స్కోర్ కలిగిన Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ పోకో ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ స్క్రీన్ ని 1.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10+ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉంటాయి.

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP సోనీ మైన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 7550 mAh హెవీ బ్యాటరీ, 90W ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రక్షణ కోసం ఫోన్ రెండు వైపులా గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో సర్కిల్ టు సెర్చ్ మరియు GPT పవర్డ్ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :