Flipkart ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ 108MP కెమెరా 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

The Big Billion days Sale అక్టోబర్ 3వ తేది నుండి మొదలవుతుంది

ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ పైన భారీ డిస్కౌంట్

Flipkart అప్ కమింగ్ ఫెస్టివల్ సేల్ The Big Billion days Sale అక్టోబర్ 3వ తేది నుండి మొదలవుతుంది. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. వాటిలో, మోటోరోలా ఇటీవల విడుదల చేసిన Motorola Edge 20 Fusion కూడా వుంది. ఈ సేల్ నుండి మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ అఫర్ తో సేల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ 108 క్వాడ్ ఫిక్షన్ కెమెరా సిస్టం, 5G ప్రొసెసర్ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది.

Motorola Edge 20 Fusion: Flipkart సేల్ అఫర్ ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ యొక్క 8GB వేరియంట్ రూ.22,999 రూపాయల ప్రైస్ తో వచ్చింది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ ఫోన్ యొక్క ఈ హాయ్ ఎండ్ వేరియంట్ 1,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.21,999 ధరకే లభిస్తుంది మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. Check Offer Here    

Motorola Edge 20: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్  6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ సైబర్ టీఎల్ మరియు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. కానీ, ఇది క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 8ఎంపి సెన్సార్ మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 8X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది.      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :