Google Pixel 6a పైన 20 వేల రూపాయల వరకూ తగ్గింపు అఫర్..!

HIGHLIGHTS

Google Pixel 6a పైన 20 వేల రూపాయల వరకూ తగ్గింపు అఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుండి ఈ బిగ్ అఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించనున్నట్లు టీజింగ్

గరిష్టంగా 20 వేల రూపాయల వరకు తగ్గింపు అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది

Google Pixel 6a పైన 20 వేల రూపాయల వరకూ తగ్గింపు అఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రేపటి నుండి మొదలవనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుండి ఈ బిగ్ అఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించనున్నట్లు టీజింగ్ చేస్తోంది. Google లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Pixel 6a గొప్ప ఫీచర్లతో వచ్చింది మరియు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి గొప్ప ఆఫర్లతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనే వారికి గరిష్టంగా 20 వేల రూపాయల వరకు తగ్గింపు అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్లిప్ ఆకృతి బిగ్ బిలియన్ డేస్ సేల్ రేపటి నుండి మొదలవుతుంది కాబట్టి, ఈ Google Pixel 6a కొనాలని చూస్తున్న కస్టమర్లు ఈ అఫర్ ను అందిపుచ్చుకోవచ్చు.

Google Pixel 6a: ధర

గూగుల్ పిక్సెల్ 6a ఇండియా వేరియంట్ ధర రూ.43,999 మరియు ఫ్లిప్‌కార్ట్ నుండి లభిస్తుంది. ఈ ఫోన్ తో 3 నెలల యూట్యూబ్  ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తోంది.

Google Pixel 6a: స్పెక్స్

గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 6.14-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది OLED ప్యానెల్‌. ఈ డిస్ప్లే ఎగువ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. పిక్సెల్ 6 ఎ స్మార్ట్ ఫోన్ Google టెన్సర్ యొక్క శక్తితో నడుస్తుంది. ఇఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.

గూగుల్ పిక్సెల్ 4 ఎ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 12.2 MP డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తుంది. ఈ కెమెరాలు OIS మరియు EIS లకు కూడా సపోర్ట్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 6 ఎ యొక్క కెమెరా Live HDR+, సినీమ్యాటిక్ పాన్, డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమెరాతో 30Kps/60Kps వద్ద 4K, 30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి వుంది.

Pixel 6 a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,410 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి వుంది. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP67 వాటర్ ప్రొటక్షన్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :