FAU-G లో కూడా PUBG తరహా టీమ్ డెత్ మ్యాచ్

Updated on 25-Feb-2021
HIGHLIGHTS

FAU-G గేమ్ ఇప్పుడు మరొక మరింత ఆహ్లదంగా మారబోతోంది.

FAUG గేమ్ లో టీమ్ డెత్ మ్యాచ్

ఇక FAU-G లో గేమింగ్ మరింత ఇంట్రస్ట్ గా మారుతుంది

ఇటీవల ఇండియాలో లాంచ్ చెయ్యబడిన భారతీయ గేమింగ్ యాప్ ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (FAU-G) గేమ్ ఇప్పుడు మరొక మరింత ఆహ్లదంగా మారబోతోంది. ఇప్పటి వరకూ కేవలం స్టోరీ మోడ్ లో మాత్రమే ఆదుకునే వీలున్న FAUG గేమ్ లో టీమ్ డెత్ మ్యాచ్ ను జత చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే, ప్లేయర్స్ కోసం FAUG గేమ్ లో టీమ్ డెత్ మ్యాచ్ తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటి వరకు ఈ భారతీయ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయక పోయినట్లయితే ఈ క్రింది సూచించిన విధంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.     

FAU-G గేమ్ ఎలా డౌన్ లోడ్ చేయాలి?

ఇందుకోసం ప్రత్యేకమైన వివరాలేమీ అవసరం లేదు. గూగుల్ స్టోర్ నుండి FAU-G లేదా ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని Search చేసి డౌన్ లోడ్ చేయాలి.

 అయితే, ఈ గేమ్ పేరుతొ చాలా క్లోన్ యాప్స్ ఇప్పటికే ఉన్నందున డెవలపర్ యాప్ డౌన్ లోడ్ చేసుకొనేముందుగా ఒక్కసారి చూసుకోండి. కానీ, ఈ గేమ్ ఆండ్రాయిడ్ 8 కంటే పాత OS ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రం పనిచేయదని గమనించాలి.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :