don't miss these big deals on OPPO K13 Turbo 5G on flipkart
ఇండియన్ మార్కెట్లో ఒప్పో సరికొత్తగా తీసుకొచ్చిన OPPO K13 Turbo 5G స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ మిస్ అవ్వకండి. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప పెర్ఫార్మన్స్ అందించే చిప్ సెట్ తో పాటు ఈ ఫోన్ చాలా వేగంగా చల్లబరిచే ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కూడా కలిగి ఉంటుంది. లేటెస్ట్ డిజైన్ మరియు సరికొత్త ఫీచర్స్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.
ఒప్పో కె30 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఒకటి రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రెండోది రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరతో అందుకోవచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.
ఇందులో బేసిక్ వేరియంట్ (8GB + 128) ను పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ ను కూడా కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. ఈ ఫోన్ ను ఒప్పో రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
Also Read: Cyber Scams నుంచి మీ వ్యక్తిగత డేటా రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి.!
ఒప్పో ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో మరియు బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ తో అందించింది. ఈ కొత్త బిల్ట్ ఫ్యాన్ ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ లో 6.8 ఇంచ్ E- స్పోర్ట్ లెవల్ AMOLED ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, HDR10+ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 17 లక్షల AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 8450 చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఒప్పో కె30 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ లో 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K (60fps) వీడియో రికార్డింగ్ మంచి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆల్ రౌండర్ ఆర్మర్ బాడీ మరియు IPX6, IPX8 అండ్ IPX9 రేటింగ్ తో టాప్ టైర్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.