CMF Phone 2 Pro today available with best limited period offer
నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ CMF Phone 2 Pro ని ఆఫర్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. 2025 లో విడుదలైన ఈ ఫోన్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ తో ఈ ఫోన్ సరైన ధరలో లాంచ్ అయ్యిందని చాలా మంది టెక్ రివ్యూవర్స్ కితాబు అందుకుంది. అటువంటి ఈ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో లభిస్తుంది.
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 18,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అదే ధరకు లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ చవక ధరలో లభిస్తుంది.
అవేమిటంటే, ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ పై రూ. 1,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 16,899 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ పై అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా ప్రధాన బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ CMF ఫోన్ మాదిరి స్క్రూ ఫిట్ డిజైన్ తో వచ్చింది. అయితే, ఈ ఫోన్ మరింత స్లీక్ మరియు ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5జి ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ అదనపు ర్యామ్ మరియు 128 జీబీ అంతర్గత మెమరీ ఉంటుంది. ఈ ఫోన్ నథింగ్ OS 3.2 తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.
ఈ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED ఫ్లెక్సిబుల్ LTPS స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10 + సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP (GN9) అల్ట్రా వైడ్, 50MP టెలీ లెన్స్ మరియు 8MP అల్ట్రా వైడ్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Great Freedom Sale కంటే ముందు అమెజాన్ భారీ 50 ఇంచ్ Smart Tv డీల్ ప్రకటించింది.!
నథింగ్ ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు బాక్స్ లో ఫాస్ట్ చార్జర్ ను కూడా కలిగి ఉంటుంది.