బెస్ట్ కెమేరా ఫోన్ Xiaomi Mi A2 ధర కేవలం రూ.11,999 మాత్రమే

HIGHLIGHTS

షావోమి యొక్క Xiaomi Mi A2 డివైజ్ రూ.16,999 ధరతో విడుదలయిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.11,999 రుప్పల ధరతో అందుతోంది.

బెస్ట్ కెమేరా ఫోన్ Xiaomi Mi A2 ధర కేవలం రూ.11,999 మాత్రమే

రెడీమి నోట్ 7 ప్రో ఇంకా సేల్ మొదలు పెట్టకముందే చాల స్మార్ట్ ఫోన్ల ధరలు పడిపోయాయి. షావోమి యొక్క Xiaomi Mi A2 డివైజ్ రూ.16,999 ధరతో విడుదలయిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.11,999 రుప్పల ధరతో అందుతోంది. ఇది Android One ప్లాట్ఫారములో ప్రారంభించబడింది మరియు ఇది Android 8.1 Oreo తో నడుస్తుంది. షావోమి యొక్క సొంత వెబ్ సైట్ నుండి ఈ ధరకు కొనుగోలుకే చెయ్యవచు

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి Mi A2  స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా, మీ ఎ2 రెడ్ మీ నోట్ 5 ప్రో ను పోలి ఉంటుంది. ఇది కార్నింగ్  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది ఇంకా ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తోకూడిన  ఒక 5.99 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగి ఉంది.  అలాగే ఈ డివైజ్ 2.2GHz ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుకభాగంలో ఉంటాయి.

ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఈ Mi A2 లో, 1.25 – మైక్రాన్  పిక్సల్స్ అందించగల ఒక 12MP సోనీ IMX486 సెన్సార్ కెమేరా ప్రధానమైందిగాను మరియు  మరొక 20MP సోనీ IMX376 సెన్సార్ ద్వితీయ కెమేరాగాను కలిగి ఉంది.  ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి చక్కగా అనుమతిస్తుంది. ఈ రెండు లెన్సులుకూడా f /1.75 ఎపర్చరును కలిగి ఉంటాయి. ముందు భాగంలో, షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీగల 20MP  సోనీ IMX376 సెన్సార్  కెమెరాని అందించారు. అలాగే ఇది క్విక్ ఛార్జ్ 4+ కు మద్దతు ఇచ్చే ఒక 3,000 mAh బ్యాటరీతో, ఈ హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. ఈ డివైనులో,  ఒక 3.5mm హెడ్ఫోన్ మాత్రం  మీరు మిస్ అవుతారు అయితే దీనికి బదులుగా, ఇది ఒక USB టైప్- C పోర్ట్ కలిగి వస్తుంది.

ఆండ్రాయిడ్ Oreo OS తో ఈ  స్మార్ట్ ఫోన్ నడుస్తుంది, ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమం కింద ప్రారంభించబడింది కాబట్టి, వినియోగదారులకు గూగుల్ క్లౌడ్, నెలసరి భద్రతా అప్డేట్స్ మరియు  రెండు అతిపెద్ద OS అప్డేట్స్ ద్వారా అపరిమితమైన అధిక-నాణ్యత గల ఫోటోలను స్టోరేజీ చేసే అవకాశం లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo