స్మార్ట్ ఫోన్ లోపలే బిల్ట్ ఇన్ Earphones, షియోమీ కొత్త పేటెంట్ చెప్పే ఆసక్తికర విషయాలు

HIGHLIGHTS

Xiaomi వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ను స్టోర్ చేయడానికి కూడా అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

షియోమి చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఆలోచన పై ఆసక్తి చూపడం ఇది మొదటిసారి కాదు

స్మార్ట్ ఫోన్ లో పూర్తి స్క్రీన్ ఇవ్వడం కోసం ఇన్ స్క్రీన్ కెమేరా మరియు వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ను స్టోర్ చేయడానికి కూడా అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి ప్రత్యేకతలతో, పూర్తి స్క్రీన్ స్మార్ట్ ‌ఫోన్ కోసం షియోమి పేటెంట్ చేస్తోంది. ఈ పేటెంట్ రెండర్స్ (నమూనా) ఫోన్‌ పైభాగంలో ఇయర్‌ బడ్స్‌ స్లాట్ ‌ను స్థూపాకార షాఫ్ట్ ‌లుగా చూపిస్తాయి, ఇది లౌడ్‌స్పీకర్ ‌గా కూడా ఉపయోగపడుతుంది.

ఊహించని విధంగా, షియోమి చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఆలోచన పై ఆసక్తి చూపడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాల సార్లు కూడా సాధారణ స్మార్ట్ ‌ఫోన్ డిజైన్లను పక్కన పెట్టి,  Mi Mix మరియు Mix Alpha వంటి ఫోన్ ‌లను విడుదల చేసిన షియోమి కి, కొత్త డిజైన్లతో ఫోన్లను లాంచ్ చేసిన చరిత్ర ఉంది.

కొత్త పేటెంట్ల నుండి ప్రేరణ పొంది, LetsGoDigital వారి ఆలోచన ప్రకారం ఊహాచిత్రాలను, డిజైన్ రెండర్‌ లను క్రియేట్ చేసింది.

రెండు పేటెంట్ల ప్రకారం, ఫోన్ పైభాగంలో రెండు రంధ్రాలు ఉంటాయి, అవి వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ ను కలిగి ఉంటాయి. షాఫ్ట్‌లో ఉంచినప్పుడు ఈ ఇయర్‌ బడ్స్  పైకి చూపిస్తాయి, అయితే ఇది చెవులకు బాగా సరిపోయేలా వివిధ కోణాల్లో ఇరుసుగా ఉంటుంది. నోట్ సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో శామ్సంగ్ ఎస్-పెన్ను ఎలా అందిస్తుంది అనేదానికి ఈ ఆలోచన చాలా పోలి ఉంటుంది.

దాని రూపాన్ని బట్టి, ఇయర్‌ బడ్‌లు స్లాట్‌ లో ఉన్నప్పుడు లౌడ్ ‌స్పీకర్‌గా కూడా మార్చుకోవచ్చు.

Image Credit : LetsGoDigital

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :