budget 4K camera 5g smartphone Lava Bold N1 5G sale started
Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు ఇప్పుడు Amazon GIF Sale 2025 అర్లీ డీల్స్ లో భాగంగా మంచి లాంచ్ డీల్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అర్లీ డీల్స్ లో భాగంగా భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. అమెజాన్ అందించిన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 6750 ధరకే అందుకోవచ్చు.
లావా బోల్డ్ ఎన్ 1 స్మార్ట్ ఫోన్ (4GB + 64GB) బేసిక్ వేరియంట్ రూ. 7,499 ధరతో మరియు (4GB + 128GB) వేరియంట్ కూడా కేవలం రూ. 7,999 ధరలో లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు అమెజాన్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ (రూ. 749) డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 6,750 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Amazon GIF Sale 2025 దెబ్బకి అతి చవక ధరలో లభిస్తున్న Soundbar Deal ఇవే.!
లావా బోల్డ్ ఎన్ 1 5జి స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ లావా కొత్త ఫోన్ 3,80,000 కంటే అధికమైన AnTuTu స్కోర్ కలిగిన UNISOC T765 ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 5జి చిప్ సెట్ మరియు జతగా 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ 5జి నెట్వర్క్ లకు సపోర్ట్ చేస్తుంది.
ఈ లావా స్మార్ట్ ఫోన్ 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడేమో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 4X జూమ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ అండ్ అట్రాక్టివ్ డిజైన్ తో ఉంటుంది.