HTC గ్రాండ్ రీ ఎంట్రీ .. కొత్త ఫోన్ ఒక రేంజ్ లో ఉందిగా.!

HIGHLIGHTS

HTC Desire 22 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

HTC యొక్క Vive Flow VR హెడ్‌సెట్ మరియు NFT సపోర్ట్ ఇస్తుంది

ఈ ఫోన్ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి “మెటావర్స్ ఫోన్” గా నిలిచింది

ఒకప్పుడు హై ఎండ్ స్మార్ట్ ఫోన్లకు పెట్టింది పేరైన HTC చాలా కాలంగా ఫోన్ ల తయారీని నిలిపివేసింది. అయితే, ఇప్పుడు మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేస్తూనే భారీ ఫీచర్లతో తన HTC Desire 22 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ HTC యొక్క Vive Flow VR హెడ్‌సెట్ మరియు NFT వంటి కొన్ని ఇతర పరికరాలకు కనెక్టింగ్ సాంకేతికతలకు మద్దతు కలిగి ఉండడం వలన ఈ ఫోన్ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి “మెటావర్స్ ఫోన్” గా నిలిచింది. ఈ స్మార్ట్ ఫోన్ 1290Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే, మంచి కెమెరా సెటప్ మరియు స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ 5G ప్రాసెసర్ తో యూరప్ మార్కెట్లో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ఫీచర్లకు మరియు మరిన్ని వివరాల పైన ఒక వేద్దాం.

HTC Desire 22 Pro: స్పెక్స్ & ఫీచర్స్ (expected)

ఈ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల పంచ్-హోల్ డిజైన్ కలిగిన FHD+ LCD డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఫోన్ పంచ్-హోల్‌ లో 32MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇక వెనుక కెమెరాల పరంగా, 64MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 5MP డెప్త్ మాడ్యూల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా  8GB RAM మరియు 128GB స్టోరేజ్‌ కుడా ఉంటుంది. 

అంతేకాదు, ఈ ఫోన్ దుమ్ము మరియు నీటి నిరోధకత కలిగిన IP67 రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ 4,520mAh బ్యాటరీని 18W ఫాస్ట్ షార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కంపనీ యూజర్ ఇంటర్ ఫెజ్ పైన Android 12 OS పైన పనిచేస్తుంది.

ఇక ప్రధాన వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ తో HTC యొక్క Viverse ఎకోసిస్టమ్ మరియు HTC Vive Flow హెడ్‌ సెట్‌ యొక్క కాంపేటబిలిటీతో వస్తుంది. తద్వారా,  మీరు వర్చువల్ రియాలిటీని ఆస్వాదించవచ్చు. అంతేకాదు, HTC ఈ స్మార్ట్ ఫోన్ తో NFT ని ఉచిత కూడా అందిస్తోంది. మీరు Viveverse వాలెట్ ద్వారా ఈ బహుమతిని రీడీమ్ చేసుకోవచ్చు.

HTC Desire 22 Pro: ధర

యూరప్‌ లో HTC Desire 22 Pro స్మార్ట్ ఫోన్ ను £399 (సుమారు రూ.38,536) ధరలో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :