Big Price Cut: సగం ధరకే లభిస్తున్న లేటెస్ట్ Poco స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

సగం ధరకే లభిస్తున్న లేటెస్ట్ Poco స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా 10 వేల ధరలో విడుదలయ్యింది

ఈ Poco ఫోన్ భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల బడ్జెట్ లో లభిస్తోంది

Big Price Cut: పోకో లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన పోకో సి 55 స్మార్ట్ ఫోన్ పైన 54% భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది అమేజాన్. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో 10 వేల రూపాయల ధరలో విడుదలయ్యింది. అయితే, ఈ ఫోన్ ప్రసుతం భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తోంది. ఈ ఫోన్ స్పెక్ మరియు ఫీచర్స్ పరంగా ఈ ప్రైస్ చాలా అట్రాక్టివ్ డీల్ గా మారింది. మరి ఈరోజు ఈ బీడ్ డీల్ వివరాల పైన ఒక లుక్కేయండి.

Big Price Cut:

పోకో ఇండియాలో సరికొత్తగా మంచి డిజైన్ తో విడుదల చేసిన Poco C55 స్మార్ట్ ఫోన్ పైన లభిస్తున్న భారీ తగ్గింపు గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ఇండియాలో Rs. 13,999 రూపాయల MRP ధరతో మరియు రూ. 10,999 రూపాయల లాంఛ్ ప్రైస్ తో వచ్చింది.

అయితే, ఈ ఫోన్ ప్రస్తుతం అమేజాన్ ఇండియా నుండి కేవలం రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ మరియు ఇతర ఆఫర్లను కూడా లభిస్తున్నాయి. Buy From Here

Also Read: Poco C61 vs Lava O2: రెండు ఫోన్ లలో బెటర్ ఏది.. కంప్లీట్ కంపేరిజన్.!

Poco C55 ఎలాంటి ఫీచర్స్ ను కలిగి వుంది?

Poco C55 మంచి ఫీచర్స్ నే కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక లెథర్ లుక్ కలిగిన ప్లాస్టిక్ బడి ఉంటుంది. కానీ ఈ ఫోన్ చాలా సన్నగా మరియు అందంగా కనిపిస్తుంది. సి55 ఫోన్ లో 6.71 ఇంచ్ HD+ పెద్ద డిస్ప్లే 120 Hz టచ్ శాంప్లింగ్ డిస్ప్లేని Oleophobic Coating తో కలిగి వుంది. ఈ ఫోన్ MediaTek G85 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 6GB ఫిజికల్ RAM మరియు 5GB వర్చువల్ ర్యామ్ తో వస్తుంది.

Poco C55 Features

అంటే, ఈ ఫోన్ లో టోటల్ 11 GB RAM ఫీచర్ ను అందుకుంటారు మరియు ఇందులో 128 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఇక ఈ ఫోన్ కెమేరాల విషయానికి వస్తే, ఇందులో 50MP AI Dual రియర్ కెమేరా సెటప్ మరియు చాలా కెమేరా ఫిల్టర్లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP52 రేటింగ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :