big price cut and huge deals Motorola Edge 50 Pro
Price Cut: భారత మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన మోటోరోలా Edge 50 Pro పై భారీ తగ్గింపు లభిస్తోంది. IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ మరియు AI పవర్డ్ కెమెరా సిస్టం తో వచ్చిన ఎడ్జ్ 50 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు Flipkart మెగా జూన్ బొనాంజా సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో తక్కువ ధరకు లభిస్తోంది. ఈ మోటోరోలా కొత్త ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న డీల్స్ మరియు ఆఫర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ 2024 ఏప్రిల్ నెలలో రూ. 31,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ను ఈ ధరతో లిస్ట్ చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ. 2,000 బిగ్ డిస్కౌంట్ తో రూ. 29,999 ధరకే ఈ ఫోన్ సేల్ అవుతోంది. అలాగే, రూ. 36,999 రూపాయల ధరతో వచ్చిన 12GB + 256GB వేరియంట్ ను రూ. 34,999 రూపాయల ధరతో లిస్ట్ చేసింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి అందించింది. ఈ ఫోన్ ను ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ EMI మరియు ఫుల్ పేమెంట్ ఆప్షన్ లతో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: EPFO బిగ్ న్యూస్: కోవిడ్ 19 అడ్వాన్స్ ను నిలిపి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ.!
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ pOLED కర్వ్డ్ డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 12GB ర్యామ్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ లో వెనుక AI పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ + 10MP టెలీ ఫోటో కెమెరా లను కలిగి వుంది. 30 fps వద్ద 4K UHD వీడియోలను మరియు గొప్ప RAW ఫోటో లను కూడా అందించ గలదు. ఈ ఫోన్ లో 4500 mAh బ్యాటరీ వుంది మరియు ఇది 67W టర్బో పవర్ ఛార్జింగ్ తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి వుంది.