స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ ని అందిస్తుంది. ఇందిలో భాగంగా యాపిల్ ,శామ్సంగ్,షియోమీ లాంటి చాలరకాల బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను మంచి ఆఫర్స్ తో అందిస్తుంది. వీటిలో, మంచి ఆఫర్ తో అందుతున్న మంచి స్పెసిఫికేషన్ కలిగిన బ్రాండ్ ఫోన్ల ని అందిస్తున్నాం మీకోసం.
Asus Zenfone Max Pro M1 (Black, 32 GB) (3 GB RAM)
ధర : 10,999
ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో మీ 1 ఫోన్లో 5.99-అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లేఉంది మరియు ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రోసెస్సేర్ శక్తితో పనిచేస్తుంది. వెనుక 13ఎంపీ + 5ఎంపీ డ్యూయల్ -రియర్ కెమేరా తో పాటు ముందు 8ఎంపీ సెన్సర్తో అందించారు. అలాగే ఇది 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి తో పాటు 2 టీబీ వరకు మెమొరీ కార్డు ద్వారా పెంచుకునే వీలుంది . ఈ పూర్తి ప్యాకేజీకి అందించగల ఒక 5000 mAh బ్యాటరీ ఇందులో అందించారు.ఇంకా దీనితో పాటు నో కాస్ట్ నో కాస్ట్ ఈఎమ్ఐ తో అందుబాటులోవుంది.కొనడానికి Click చేయండి.
Samsung Galaxy On6 (Blue, 64 GB) (4 GB RAM)
ధర : 15,490
ఫ్లిప్ కార్ట్ దీనిమీద మంచి ఆఫర్ని ప్రకటించింది ప్రస్తుతం రూ. 15,490 రేటుతో వున్నా ఈ శామ్సంగ్ గాలక్సీ ఆన్6 మీద ఫ్లిప్ కార్ట్ 12 శాతం తగ్గింపుతో రూ. 13,490 ప్రైస్ తో అందిస్తుంది. దీని స్పెక్స్ విషయానికి వస్తే , దీంట్లో 5.6-అంగుళాల హెచ్ డి+ డిస్ప్లే మరియు వెనుక 13ఎంపీ సింగల్ కెమేరా ఇంకా సెల్ఫీ కోసం ముందు 8 ఎంపీ సెన్సార్ ని ఉంచారు. అలాగే 1.6 GHz ఎక్సీనాస్ ఆక్టా – కోర్ శక్తితో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో పాటు మెమొరీ సాయంతో 256 జీబీ స్టోరేజి పెంచుకునే వీలుంది. ఇది కూడా నో కాస్ట్ ఈఎమ్ఐ తో అందుబాటులోవుంది.కొనడానికి Click చేయండి.
Honor 9 Lite (Sapphire Blue, 32 GB) (3 GB RAM)
ధర : 13,999
ఈ హానర్ 9 లైట్ సఫైర్ బ్ల్యూ ఫోన్ 5.65-అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే కలిగివుంది. కెమేరా విషయానికొస్తే 13ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ – కెమేరా ముందు మరియు వెనుక ఒకే విధమైన కెమేరా ని అందించారు. ఇది కిరిణ్ 659 ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనీలో 3000 mAh బ్యాటరీని అమర్చారు.ఈ వేరియంట్లో 3జీబీ ర్యామ్ మరియు 32జీబీ స్టోరేజి తో పాటు 256జీబీ పెంచుకునే అవకాశముంది.కొనడానికి Click చేయండి.
VIVO V9 (Sapphire Blue, 64 GB) (4 GB RAM)
ధర : 23,990
వివో ప్రీమియంగా అందిస్తున్న వివో వీ 9 సఫైర్ బ్ల్యూ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది . 2280 X 1080 పిక్సెల్స్ తో కూడిన ఒక 6.3-అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే ఇందులో అమర్చబడినది. 16ఎంపీ + 5ఎంపీ రియర్ డ్యూయల్ – కెమేరాని వెనుక భాగంలో సెటప్ చేసారు ఇంకా సెల్ఫీల కోసం ముందు భాగంలో AI పేస్ బ్యూటీ ఫీచర్ గల 24 ఎంపీ కెమేరా ఇవ్వబడింది. మొత్తం ప్యాకేజీకి అనుగుణంగా 3260mAh బ్యాటరీని అందించారు.కొనడానికి Click చేయండి.
Apple iPhone SE (Space Grey, 32 GB)
ధర : 23,000
ఈ ఐఫోన్ ఎస్ఈ 1136 X 640 పిక్సెల్స్ గా కలిగిన 4-అంగుళాల రెటీనా డిస్ప్లే తో వస్తుంది. ఈ డివైజ్ వెనుక భాగంలో 1.22 µ పిక్సెల్స్ తో కూడిన 12ఎంపీ కెమేరా మరియు ముందుభాగంలో 1.2ఎంపీ కెమేరా ని కలిగి వుంది. ఇది యాపిల్ A 9 64-బిట్ ప్రోసెస్సేర్ ఇంకా M9 మోషన్ కో – ప్రొసెసర్ శక్తితో పని చేస్తుంది. అదేవిధంగా పైన తెలిపిన ఆఫర్ తో పాటు సిటీ క్రెడిట్ కార్డు వినియోగంతో 10% అదనపు క్యాష్ బ్యాక్,ఆక్సిస్ బజ్ క్రెడిట్ కార్డ్ తో 5శాతం అఫర్ గా అందిస్తున్నారు.కొనడానికి Click చేయండి.
Lenovo K8 Plus (Venom Black, 32 GB) (3 GB RAM)
ధర : 10,999
ఈ లెనోవా కే8 ప్లస్ మెడియ టేక్ హీలియో P25 తో కూడిన 2.5GHz ఆక్టా – కోర్ ప్రోసిజర్ తో పనిచేస్తుంది.ఇందులో 5.2-అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే ఇవ్వబడింది.దీనిలో 13ఎంపీ + 5ఎంపీ డ్యూయల్ కెమేరావెనుక ప్రధాన కెమేరాగా మరియు ముందుభాగంలో 8ఎంపీ సెన్సార్ ని అందించారు. ఇది ఆండ్రాయిడ్ 7.1.1/స్టాక్ ఆండ్రాయిడ్ వెర్షన్ లలో లభిస్తుంది. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటుగా 4000mAh బ్యాటరీని కూడా ఉంచారు.3జీబీ ర్యం మరియు 32జీబీ స్టోరేజి తో పాతుం 128జీబీ వరకు పెంచుకోవచ్చు. దీనిలో 4జి వోల్ట్ అందుబాటులో ఉంటుంది.పూర్తి స్థాయి ఆడియో క్వాలిటీ కోసం ఇది Dolby Atmos తో అందించబడింది.కొనడానికి Click చేయండి.
Mi Max 2 (Black, 64 GB) (4 GB RAM)
ధర : 16,999
మీ మాక్స్ 2 దీని పేరు లాగానే ఇందులో కూడా అన్నీకూడా మాక్స్ గానే అందించారు.1920 X 1080 పిక్సెల్స్ అందించగల 6.44-అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లేతో వస్తుంది.వెనుక ఒక 12ఎంపీ రియర్ కెమెరా తో పాటు 5ఎంపీ సెన్సార్ ని ముందు భాగంలో ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 తో కూడిన ఆక్టా – కోర్ 2GHz ప్రాసెస్ తో ఇది పనిచేస్తుంది.అలాగే MiUi 8 తో కూడిన ఆండ్రాయిడ్ 7.1.1 తో పనిచేస్తుంది. దీని బ్యాటరీ కూడా 5300mAh శక్తితో మాక్స్ గానే వుంది. ఇది 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి ఇంకా 128జీబీ వరకు దీనిని పెంచుకునే వీలుంది.కొనడానికి Click చేయండి.
OPPO A83 (2018 Edition) (Red, 64 GB) (4 GB RAM)
ధర : 16,990
ఈ ఒప్పో ఏ83 2018 ఎడిసన్ 83.9 డిస్ప్లే ఏరియా గా గలిగిన 1440 X 720 పిక్సెల్స్ తో కూడిన ఒక 5.7-అంగుళాల TFT డిస్ప్లే దీనిలో పొందుపరిచారు. ఇది ARM మాలి జి71ఎంపీ2 770MHz ఆక్టా – కోర్ 2.GHz శక్తితో పనిచేస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 7.1 తో వస్తుంది. ఇందులో AI ఫీచర్ గల సింగల్ 13ఎంపీ కెమెరా వెనుక భాగంలో మరియు 8ఎంపీ సెన్సార్ ముందు భాగంలో ఇవ్వబడ్డాయి. ఇది 4జీబీ ర్యామ్ మరియు 64 స్టోరేజి తో వస్తుంది SD కార్డు తో పెంచుకునే వీలుంది.కొనడానికి Click చేయండి.
Samsung Galaxy S7 Edge (Black Onyx, 32 GB) (4 GB RAM)
ధర : 41,900
ఈ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్ 2560 X 1440 పిక్సెల్స్ అందించగల క్వాడ్ హెచ్ డి సుపర్ అమోల్డ్ డిస్ప్లే కలిగివుంది. దింట్లో f/1.7 ఆపేర్చేర్ తో కూడిన సింగల్ 12ఎంపీ కెమేరా వెనుక భాగంలో ఉంచారు,అలాగే సెల్ఫీ కోసం సెల్ఫీ ఫ్లాష్ కలిగిన 5ఎంపీ కెమేరా ని ముందు భాగంలో ఉంచారు. ప్రధాన కెమేరా తో 30fps తో 3840 X 2160 తో వీడియోలను చిత్రీకరించవచ్చు .ఈ డివైజ్ 2.3 మరియు 1.6 క్లాక్ సీడ్ తో కూడిన ఆక్టా – కోర్ ఎక్సీనోస్ 8890 ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్ మరియు 32జీబీ అంతర్గత స్టోరేజి తో పాటు SD కార్డు సహాయంతో 200జీబీ వరకు పెంచుకోవచ్చు.కొనడానికి Click చేయండి.
Google Pixel 2 (Just Black, 64 GB) (4 GB RAM)
ధర : 61,000
ఈ గూగుల్ పిక్సల్ 2 1920 X 1080 పిక్సెల్స్ అందించగల ఒక 5.0 ఫుల్ హెచ్ డి డిస్ప్లే కలిగివుంది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 64-బిట్ 2. 35 GHz మరియు 1.9 తో కూడిన ఆక్టా – కోర్ శక్తితో పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ ఓరెయో 8.1.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. అలాగే 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజీ తో అందుతుంది. ఇందులో 2700 mAh బ్యాటరీని అందించారు.కొనడానికి Click చేయండి.