REALME రియల్‌ పబ్లిక్ సేల్‌ నుండి రియల్మీ 3, రియల్మీ 5 ప్రో, రియల్మీ XT పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

రియల్మి బడ్స్‌ వైర్‌ లెస్‌ పైన కూడా ప్రత్యేక డీల్స్ అందిస్తోంది.

రియల్మీ తన వినియోగదారుల కోసం రియల్‌ పబ్లిక్ సేల్‌ ను ప్రకటించింది. ఈ సెల్ 2020 జనవరి 19 న ప్రారంభమై 22 జనవరి 2020 వరకు జరగనుంది. ఈ సేల్  Flipkart మరియు realme.com ఆన్లైన్ ప్లాట్ఫారం పైన జరుగుతుంది.  ఈ సేల్ నుండి, రియల్మి తన రియల్మి 3, రియల్మి 5 ప్రో, రియల్మి XT, రియల్మి ఎక్స్‌ ఫోన్లల పైన డిస్కౌంట్లను అందిస్తోంది, అలాగే రియల్మి బడ్స్‌ 2, రియల్మి బడ్స్‌ వైర్‌ లెస్‌ పైన కూడా ప్రత్యేక డీల్స్ అందిస్తోంది.

రియల్‌ పబ్లిక్ సేల్ సమయంలో, రియల్మి 2 ప్రో యొక్క 4 + 64 జిబి, 6 + 64 జిబి మరియు 8 + 128 జిబి వేరియంట్లు వరుసగా రూ .7,999, రూ .9,999 మరియు రూ .11,999 లకు లభిస్తాయి.

రియల్మి 3 యొక్క 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .7,999. ఇది కాకుండా, 3 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ కు రూ .1500 డిస్కౌంట్ లభిస్తుండగా, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .1000 డిస్కౌంట్ తర్వాత రూ .6,999 కు లభిస్తుంది.

రియల్మి 3 i యొక్క 3 + 32 జిబి మరియు 4 + 64 జిబి వేరియంట్లు వరుసగా రూ .6,999, రూ .7,999 లకు లభించబోతున్నాయి. ఇవి కాకుండా రియల్మి X కి చెందిన 4 + 128 జిబి వేరియంట్‌ రూ .16,999 కు బదులుగా రూ .14,999 కు లభిస్తుండగా, రియల్మి XT యొక్క 4 + 64 జిబి వేరియంట్‌ రూ .15,999 కు బదులుగా రూ .14,999 కు లభిస్తుంది.

రియల్మి సి 2 యొక్క 3 + 32 జిబి వేరియంట్ రూ .500 తగ్గింపుతో రూ .7,499 కు లభిస్తుంది. ఇది కాకుండా రియల్‌మే 5 ప్రో యొక్క 4 + 64 జీబీ వేరియంట్‌ ను రూ .11,999 ధరకు , 6 + 64 జీబీ వేరియంట్ రూ .12,999, 8 + 128 జీబీ మోడల్‌ ను రూ .14,999 ధరకు విక్రయించనున్నారు.

రియల్మి స్మార్ట్‌ ఫోన్లతో పాటు, రియల్మి బడ్స్ 2 మరియు రియల్మి బడ్స్ వైర్‌ లెస్ మొదలైన సరికొత్త ఉపకరణాల పైన కూడా  గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లను జనవరి 18 నుండి జనవరి 22 వరకు జరగనున్న సెల్‌ లో పొందవచ్చు.

రియల్మి బడ్స్ 2 రూ .599 కు బదులుగా రూ .499 కు, రియల్మి బడ్స్ వైర్‌ లెస్ యొక్క అన్ని కలర్ వేరియంట్లు 1,799 రూపాయలకు బదులుగా రూ .1,599 కు అమ్ముడవుతాయి.

ఈ డీల్స్ రియల్మి వెబ్‌ సైట్‌ లో జనవరి 20 మరియు 23 మధ్య అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ కోసం, రియల్‌ పబ్లిక్ బెస్ట్ డీల్స్, రియల్‌ పబ్లిక్ లక్కీ బాగ్, రియల్‌ పబ్లిక్ విష్ మరియు స్పెషల్ ఆఫర్లు వంటి అనేక డీల్స్ కంపెనీ అందిస్తోంది .

రియల్‌ పబ్లిక్ లక్కీ బాగ్ కింద లక్కీ విన్నర్లకు ఐదు రియల్మి యు 1 మరియు 100 రియల్మి బడ్స్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ పొందడానికి, వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :