ఇండియాలోని టాప్-5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2022)

Updated on 14-Jan-2022
HIGHLIGHTS

మొబైల్ తయారీ సంస్థలు ఫోన్లలో మంచి పనితనం కలిగిన కెమెరాలను అందిస్తున్నాయి

భారతదేశంలోని అత్యుత్తమ కెమెరా స్మార్ట్‌ ఫోన్స్

అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయగల గొప్ప కెమెరాలను కలిగిన స్మార్ట్‌ ఫోన్స్

ఒక స్మార్ట్ ఫోన్ ను ఎంచుకునే ముందుగా అందులోని కెమెరా సత్తా లేదా ఫీచర్స్ గురించి కూడా వినియోగదారులు ఆలోచిస్తున్నారు. దీనికి అనుగుణంగానే మొబైల్ తయారీ సంస్థలు కూడా వారి ఫోన్లలో మంచి పనితనం కలిగిన కెమెరాలను అందిస్తున్నాయి. అందుకే, భారతదేశంలోని అత్యుత్తమ కెమెరా స్మార్ట్‌ ఫోన్స్ ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయగల గొప్ప కెమెరాలను కలిగి ఉన్నాయి. ప్రైస్ ని దృష్టిలో పెట్టుకోకుండా అద్భుతమైన చిత్రాలను ఆశించే వారికోసం ఇండియాలోని టాప్-5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ అందించాను.     

1. Apple iPhone 13 Pro Max (Buy Here)

ధర : రూ. 1,29,990

ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అధునాతన మరియు మెరుగైన కెమెరా సిస్టమ్‌ను కలిగివుంది. ఈ ఫోన్ సెన్సార్-షిఫ్ట్ OIS (ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్)   f/1.5 ఎపర్చర్‌తో 12MP ప్రధాన కెమెరా, 3 X ఆప్టికల్ జూమ్‌ కలిగిన 12 MP టెలిఫోటో కెమెరా, 12 MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 3D  LiDAR సెన్సార్‌ లను కలిగి ఉన్నాయి. ఈ రియర్ కెమెరా 4K UHD వీడియోలను 60FPS వరకు Dolby Vision HDR, 10-bit HDR, ProRes మరియు మరిన్ని ఫీచర్లతో రికార్డ్ చేయగలవు. ప్రో మ్యాక్స్ పెద్ద 6.7 ఇంచ్ సూపర్ రెటినా XDR ProMotion డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో (2532 x 1170) పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే HDR10, Dolby Vision లకు సపోర్ట్ ఉంది మరియు స్క్రాచ్-రెసిస్టెంట్ సిరామిక్ గ్లాస్  ని కూడా ఆపిల్ ఈ ఫోన్లలో అందించింది. Apple iPhone 13 Pro Max అత్యంత వేగవంతమైన  A15 బయోనిక్ చిప్ శక్తితో పనిచేస్తుంది.

2. Samsung Galaxy S21 Ultra (Buy Here)

ధర : రూ. 1,05,999

Samsung Galaxy S21 Ultra ఫోన్ ప్రస్తుతం అతిపెద్ద డిస్‌ప్లే కలిగివున్న ఫోన్‌లలో ఒకటి. ఇది 6.8-అంగుళాల QHD+ AMOLED ప్యానెల్ మరియు 3200 x 1440 రిజల్యూషన్ తో వస్తుంది. Samsung Galaxy S21 Ultra కంపెనీ యొక్క సొంత Exynos 2100 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్(PDAF) మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో వస్తుంది. ఇది డ్యూయల్-పిక్సెల్ ఆటోఫోకస్‌తో 12MP (F/2.2) అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో జత చేయబడింది. ఈ ఫోన్ 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 4.5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేసే పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

3. Xiaomi Mi 11 Ultra (Buy Here)

ధర : రూ. 69,999 

మి 11 అల్ట్రా  కూడా పెద్ద 6.81-అంగుళాల AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఇది QHD + (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్‌ అందిస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మద్దతు ఇస్తుండడమే కాకుండా  Dolby Vision తో పాటుగా HDR10 + ప్లేబ్యాక్ కోసం కూడా ధృవీకరించబడింది. అధనంగా, వెనుకవైపున కూడా ఒక చిన్న స్క్రీన్ వుంది. మి 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ ‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 60 GPU తో పనిచేస్తుంది. ఈ ఫోన్ అవుట్-ఆఫ్-బాక్స్‌ MIUI 12 లో నడుస్తుంది.ఈ ఫోన్ F / 2.0 ఎపర్చరు మరియు OIS మద్దతుతో 50MP ప్రాధమిక కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 120X వరకు డిజిటల్ జూమ్ అందించగల 48MP పెరిస్కోప్ కెమెరా మరియు 128-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. . వెనుక కెమెరాలు 24 fps వద్ద 8K మరియు 60 fps వరకు 4K  UHD లో రికార్డ్ చేయగలవు. ముందు వైపు, నాచ్ కటౌట్ లోపల 20MP సెల్ఫీ కెమెరా ఉంది.ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W ఫాస్ట్ వైర్డ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

4. Vivo X70 Pro+ (Buy Here)

ధర : రూ. 79,990

ViVo X70 Pro+ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888+ చిప్‌సెట్‌ శక్తితో పనిచేస్తుంది మరియు 5G సామర్థ్యాలతో వస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ 3 కి కూడా మద్దతు ఇస్తుంది. వివో ఫోన్ కోసం ఆప్టిక్స్‌లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్ అయిన ZEISS తో తన వ్యూహాత్మక ఇమేజింగ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించింది.  ఫోటోగ్రాఫ్స్ మరియు వీడియోలను నాచురల్ కనిపించేలా రూపొందించడానికి వివో యొక్క లేటెస్ట్ హార్డ్‌వేర్ మరియు ఐకానిక్ ఎలిమెంట్‌లను చేర్చడానికి ప్రయత్నిస్తుంది. ఇది 32MP ఫ్రంట్ కెమెరా మరియు వెనుక 50MP + 48MP + 12MP + 8MP క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇది 30FPS వద్ద 8K UHD వీడియోలను మరియు 60FPS వరకు 4K UHD వీడియోలను రికార్డ్ చేయగలదు. ఇది QHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

5. OnePlus 9 Pro (Buy Here)

ధర : రూ. 64,999

OnePlus 9 Pro అల్యూమినియం-గ్లాస్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ LTPO బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీతో 6.7-అంగుళాల QHD+ (3216×1440 పిక్సెల్‌లు) రిజల్యూషన్ AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉందిOnePlus 9 Pro Qualcomm Snapdragon 888 ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు 12GB LPDDR5 RAM మరియు 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌లతో జత చేయబడింది. OnePlus 9 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలను కలిగి ఉంది, ఇది సోనీ IMX789 సెన్సార్‌తో ప్రాథమిక 48MP కెమెరాతో f/1.8 ఎపర్చరును కలిగి ఉంది మరియు EISకి మద్దతు ఇస్తుంది. ఛార్జింగ్ పరంగా కూడా 65W మరియు 65T వ్రాప్ ఛార్జింగ్ సపోర్ట్ ని టెక్నాలజీతో అందించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :