5G Phone: 10 వేల బడ్జెట్ లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా.!

HIGHLIGHTS

10 వేల బడ్జెట్ లో కొత్త 5G స్మార్ట్ ఫోన్

4G రేట్లకే 5G ప్లాన్ లు లభిస్తుండడంతో 5జి ఫోన్ కొనడానికి ఇష్టపడుతున్నారు

10 వేల రూపాయల బడ్జెట్ లో కూడా మొబైల్ కంపెనీలు 5జి మొబైల్ లను తీసుకు వచ్చాయి

5G Phone: 10 వేల బడ్జెట్ లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా.!

5G Phone: 10 వేల బడ్జెట్ లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, ప్రస్తుతం మార్కెట్ లో మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో కూడా 5G నెట్ వర్క్ అందుబాటులోకి రావడం మరియు 4G రేట్లకే 5G ప్లాన్ లు లభిస్తుండడంతో యూజర్లు 5జి స్మార్ట్ ఫోన్ లనే కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే, ఒక స్మార్ట్ ఫోన్ కొనడానికి సగటు యూజర్ కు బడ్జెట్ ముఖ్యమైన అంశంగ మారింది. అందుకే, మొబైల్ కంపెనీలు 10 వేల రూపాయల బడ్జెట్ లో కూడా మంచి 5జి ఫోన్ లను అందించడానికి కృషి చేస్తునాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5G Phone Under 10K

ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడు చాలా చవక ధరలో కూడా 5G స్మార్ట్ ఫోన్ లు లభిస్తున్నాయి. 10 వేల రూపాయల బడ్జెట్ లో కూడా మొబైల్ కంపెనీలు 5జి మొబైల్ లను తీసుకు వచ్చాయి. 10 వేల రూపాయల బడ్జెట్ మంచి ఫీచర్స్ తో లభిస్తున్న బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ లు గురించి ఈరోజు చూద్దాం.

Lava Blaze 5G

Price : Rs. 9,999

ఇండియన్ మొబైల్ బ్రాండ్ Lava అందించిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ లభిస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ 6GB RAM + 5GB వర్చువల్ RAM మరియు UFS 2.2 128GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 6.5 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ HD+ డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమేరా, 5000mAh బిగ్ బ్యాటరీ మరియు MediaTek Dimensity 700 వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. Buy From Here

Also Read: Aadhaar Complaint: ఆధార్ కంప్లైంట్స్ కోసం కొత్త పోర్టల్.!

Redmi 13C 5G

Price : Rs. 10,999

రెడ్ మి లేటెస్ట్ గా లాంఛ్ చేసిన ఈ 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఈ షియోమి స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 6100+ 5G ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు 4GB RAM + 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగిన 6.74 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ HD+ డిస్ప్లే, 50MP AI డ్యూయల్ కెమేరా, 4GB వర్చువల్ RAM మరియు 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here

itel P55 5G

Price : Rs. 10,499

బడ్జెట్ మొబైల్ బ్రాండ్ గా మంచి ఇండియన్ మార్కెట్ లో పేరు తెచ్చుకున్న itel అందించిన బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఈ P55 5G. ఈ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో Dimensity 6080 ప్రోసెసర్, 6GB RAM + 6GB మెమోరీ ఫ్యూజన్ మరియు +128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, 6.6 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ HD+ IPS డిస్ప్లే, Chat GPT అసిస్టెంట్, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo