ASUS 8z: అసూస్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!

HIGHLIGHTS

Asus 8z స్మార్ట్ ఫోన్ మొదటి సేల్

HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లే

OIS సపోర్ట్ కలిగిన 64MP SonyIMX686 సెన్సార్ కలిగిన కెమెరా సిస్టమ్

అసూస్ ప్రీమియం ఫీచర్లతో ఇండియాలో విడుదల చేసిన Asus 8z స్మార్ట్ ఫోన్ మొదటి సరిగా అమ్మకానికి రానుంది. HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లే మరియు OIS సపోర్ట్ కలిగిన 64MP SonyIMX686 సెన్సార్ కలిగిన కెమెరా సిస్టమ్ వంటి భారీ ఫీచర్లతో అసూస్ 8జెడ్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది.   

Asus 8z: ధర మరియు సేల్

అసూస్ 8z సింగల్ వేరియంట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.42,999 రూపాయల ధరతో వచ్చింది. ఈ ఫోన్ మార్చ్ 7వ తేది మద్యహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.

Asus 8z: స్పెక్స్

ఈ అసూస్ 8z 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 5.9 ఇంచ్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఇది FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్క్రీన్ కు రక్షణగా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు Adreno 660 GPU తో ఉంటుంది. దీనికి జతగా  గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

కెమెరా విభాగంలో, ఈ లేటెస్ట్ అసూస్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు తో ఉంది. ఈ డ్యూయల్ కెమెరాలో OIS సపోర్ట్ కలిగిన 64MP SonyIMX686 ప్రధాన కెమెరాకి జతగా  12MP అల్ట్రా వైడ్ కెమెరా సపోర్ట్ తో వస్తుంది. ముందుభాగంలో, 12MP డ్యూయల్ పిక్స్లల్  కెమెరాని SonyIMX 363 సెన్సార్ తో ఇచ్చింది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 5G స్మార్ట్ ఫోన్ 4,000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే,ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS ఆధారితంగా Zen UI 8 స్కిన్ పైన పనిచేస్తుంది. ఆడియో పరంగా, డ్యూయల్ స్పీకర్లను Hi-Res మరియు Derac Audio సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :