ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ తో iPhone 11 మరియు iPhone 12 సిరీస్ పైన భారీ తగ్గింపు

HIGHLIGHTS

ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల రేట్లలో భారీ తగ్గింపు

ఐఫోన్ రేట్లలో కొత్తగా ప్రైస్ కట్

పాత సిరీస్ ఫోన్ల పైన భారీ తగ్గింపు

ఆపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ సిరీస్ iPhone 13 సిరీస్ లాంచ్ తరువాత ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల రేట్లలో భారీ తగ్గింపు ప్రకటించింది. ఎప్పటిలాగానే ఆపిల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పాత సిరీస్ ఫోన్ల పైన భారీ తగ్గింపునే అందించింది. ఈ కొత్త ధరలను ఐఫోన్ 12,  ఐఫోన్ 12 మినీ మరియు ఐఫోన్ 11 లకు వర్తింప చేసింది.

ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 11 సిరీస్ కొత్త ధరలు

కొత్తగా అందించిన ప్రైస్ కట్ తరువాత కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

MODEL

OLD PRICE

NEW PRICE

iPhone 11 64GB

Rs 54,900

Rs 49,900

iPhone 11 128GB

Rs 59,900

Rs 54,900

IP 12 mini 64GB

Rs 69,900

Rs 59,900

IP 12 mini 128GB

Rs 74900

Rs 64,900

IP 12 mini 256GB

Rs 84,900

Rs 74,900

iPhone 12 64GB

Rs 79,900

Rs 65,900

iPhone 12 128GB

Rs 84,900

Rs 70,900

iPhone 12 256GB

Rs 94,900

Rs 80,900

కొత్తగా సూచించిన ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నా కూడా వచ్చే నెల మొదలుకానున్న పండుగ సీజన్ నుండి మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే పొందేవీలుంది.

Apple iPhone 13 Series

ఇక కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర విషయానికి వస్తే, Apple iPhone 13 Mini యొక్క 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ కోసం రూ. 69,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .79,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .99,900 ధర నిర్ణయించింది.

ఐఫోన్ 13 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ కోసం రూ. 79,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .89,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,09,900 ధర నిర్ణయించింది.

ఐఫోన్ 13 ప్రో 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ కోసం రూ. 1,19,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,29,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,49,900 ధర మరియు 1TB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ .1,69,900 ధరను నిర్ణయించింది.

ఇక ఈ సిరీస్ లో హై ఎండ్ ఫోన్ అయిన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్‌ కోసం రూ. 1,29,900 ధర, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,39,900 మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కోసం రూ .1,59,900 ధర మరియు 1TB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ .1,79,900 ధరను నిర్ణయించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :