Apple iPhone 17 Pro and 17 Pro Max price specs and features
Apple iPhone 17 Pro అండ్ 17 Pro Max ఫోన్లు ఈరోజు గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియాలో కూడా లాంచ్ అయ్యాయి. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లో ఇది టాప్ ఎండ్ ఫోన్ ఫోన్ అవుతుంది. ఆపిల్ ఈ ప్రీమియం ఐఫోన్ ని భారీ ఫీచర్స్, లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు సూపర్ కెమెరాతో లాంచ్ చేసింది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్ లలో పవర్ ఫుల్ ఫోన్ గా ఉంటుంది. ఈ కొత్త ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఆపిల్ లాంచ్ చేసిన ఈ కొత్త ప్రీమియం ఫోన్ భారీ ఫీచర్స్ కలిగి ఉంది. వీటిలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9 ఇంచ్ స్క్రీన్ తో మరియు ఐఫోన్ 17 ప్రో మాత్రం 6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ తో ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ ని డాల్బీ విజన్ సపోర్ట్, ఎండలో కూడా స్పష్టంగా కనిపించే గొప్ప బ్రైట్నెస్, సూపర్ రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప రిజల్యూషన్ తో అందించింది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ సరికొత్త Apple A19 Pro చిప్ సెట్ తో అందించింది. ఇది 3nm టెక్నాలజీ చిప్ సెట్ మరియు సూపర్ పెర్ఫార్మెన్స్ కోసం నిర్మించిన చిప్ సెట్ గా ఆపిల్ తెలిపింది. ఈ ఫోన్ ను అల్యూమినియం బాడీ మరియు మరింత కఠినమైన సిరామిక్ షీల్డ్ 2 తో చాలా పటిష్టంగా నిర్మించింది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక మొత్తం మూడు 48MP ఫ్యూజన్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది మరియు ముందు కూడా 18MP సెంటర్ స్టేజ్ కెమెరాతో ఈ ఫోన్ ను అప్గ్రేడ్ చేసింది. ఈ ఫోన్ లో కొత్తగా 8x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన టెలిఫోటో కెమెరా జత చేసింది. ఈ ఫోన్ 4K 120 FPS వీడియో రికార్డింగ్, Dolby Vision వీడియోస్ మరియు ఆపిల్ కెమెరా ఫిల్టర్స్ మరియు లేటెస్ట్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇది మరింత సహజమైన కలర్స్ తో ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది.
ఈ లేటెస్ట్ ప్రీమియం ఐఫోన్ లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు MagSafe ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో కూడా టైప్ C పోర్ట్ ను ఆపిల్ కొనసాగించింది. ఈ ఫోన్ Wi-Fi 7 మరియు కొత్త 5G మోడెమ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Satellite SOS మరియు ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Also Read: Apple iPhone 17: బేస్ మోడల్ ను సైతం భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసిన యాపిల్.!
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ను నాలుగు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ధర వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ప్రారంభం అవుతాయి మరియు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ సిల్వర్ కాస్మిక్ ఆరెంజ్ మరియు డీప్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.