Apple iPhone 17 price features and specs know here
Apple iPhone 17: ఈరోజు ఆపిల్ పార్క్ లో నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు విడుదల చేసింది. భారీ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసిన ఆపిల్ ఈ సిరీస్ యొక్క బేస్ మోడల్ ఐఫోన్ 17 ని కూడా భారీ ఫీచర్స్ తో విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ ఫోన్ లో కొత్త అడ్వాన్స్డ్ చిప్ సెట్ మరియు అడ్వాన్స్డ్ కెమెరాలు అందించింది. మరి ఆపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
ఆపిల్ ఈ లేటెస్ట్ ఐఫోన్ ను 6.3 అంగుళాల స్క్రీన్ తో లాంచ్ లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ HDR10+, Dolby Vision సపోర్ట్, మరియు 1Hz – 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 17 ఫోన్ లో 3nm టెక్నాలజీ కలిగిన A19 Bionic చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ స్లిమ్ బెజెల్ మరియు కొత్త డిజైన్ తో ఈ ఫోన్ మరింత ప్రీమియం లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ కొత్త iOS 26 తో నడుస్తుంది మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ AI సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను సిరామిక్ షీల్డ్ 2 తో అందించింది. ఇది ఫోన్ ను మరింత కఠినంగా చేస్తుంది.
ఐఫోన్ 17 ఫోన్ లో వెనుక 48MP ప్రైమరీ వైడ్ కెమెరా మరియు 12MP (2x టెలిఫోటో) కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈసారి సెల్ఫీ కెమెరాలో చాలా కొత్త ఫీచర్స్ కూడా జత చేసింది. ఈ ఫోన్ 4K Dolby Vision సపోర్ట్ వీడియోలు మరియు HDR 10+ వీడియోలతో పాటు గొప్ప ఫోటోలు కూడా ఆఫర్ చేస్తుందని ఆపిల్ తెలిపింది. ఈ ఫోన్ నైట్ మోడ్, పోర్ట్రైట్ మోడ్ మరియు AI ఆధారిత కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఒకరోజు మొత్తం పనిచేసే పవర్ ఫుల్ బ్యాటరీ ఐఫోన్ 17 ఫోన్ లో అందించినట్లు యాపిల్ తెలిపింది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు MagSafe వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఎక్స్ ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ లో మరింత ఎక్కువ సమయం పని చేస్తుందని కూడా యాపిల్ తెలిపింది. ఈ ఫోన్ Satellite SOS తో పాటు Apple Intelligence వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
Also Read: బిగ్ డీల్: 30 వేలకే Google Pixel 8a పవర్ ఫుల్ ఫోన్ అందుకోండి.!
ఆపిల్ ఐఫోన్ 17 ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఐఫోన్ 17 ధర వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 17 ఫోన్ లావెండర్, సేజ్, మిస్ట్ బ్లూ, వైట్ మరియు బ్లాక్ ఐదు రంగుల్లో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది.