Apple Event 2025 announced iphone 17 series and more expected
Apple Event 2025 : యాపిల్ అప్ కమింగ్ లాంచ్ ఈవెంట్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో ఈ అతిపెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు డేట్ ప్రకటించింది. అయితే, ఈ అప్ కమింగ్ ఈవెంట్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది, అనే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ ఈవెంట్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ తో పాటు ఆపిల్ స్మార్ట్ సిరీస్ 11 మరియు ఎయిర్ పోడ్స్ 3 వంటి మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
యాపిల్ ఈవెంట్ 2025 కార్యక్రమం సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ఇండియా కాలమానం ప్రకారం చూస్తే, ఇక్కడ సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్ యాపిల్ టీవీ మరియు యాపిల్ అఫీషియల్ సైట్ నుంచి లైవ్ ప్రసారం అవుతుంది. అఫ్ కోర్స్, యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో కూడా వెంటనే అప్డేట్స్ లభిస్తాయి.
యాపిల్ ఈవెంట్ 2025 నుంచి కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ బిగ్ ఈవెంట్ నుంచి యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్ అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కొత్త ఫీచర్లు మరియు సరికొత్త డిజైన్ తో రావచ్చని కూడా ఊహిస్తున్నారు.
కేవలం ఐఫోన్ మాత్రమే కాదు ఈ ఈవెంట్ నుంచి యాపిల్ వాచ్ అల్ట్రా 3 స్మార్ట్ వాచ్ అందించే అవకాశం ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, శాటిలైట్ కనెక్టివిటీ, 5G మరియు పెద్ద డిస్ప్లే కలిగి ఉండే అవకాశం ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Also Read: Gemini Reimagine ఫీచర్ తో కలా నిజమా అనే రీతిలో ఫోటోలకు కొత్త రూపం.. మరి మీరు ట్రై చేశారా.!
అయితే, యాపిల్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు సుమ. ఇది కేవలం ఎవరికి వారు వేస్తున్న అంచనా మరియు ఎక్స్పెక్టెడ్ వివరాలు మాత్రమే అని గమనించాలి.