amazon today offers big coupon discount offer on Realme narzo 60X 5G
అమేజాన్ ఇండియా ఈరోజు రియల్ మి యొక్క లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme narzo 60X 5G పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఈ అమేజాన్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. దీనికి తోడు బ్యాంకు ఆఫర్ ను కూడా జోడిస్తే, ఈ స్మార్ట్ ఫోన్ మరింత చవక ధరకే లభిస్తుంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఆఫర్ కోసం చూస్తున్నట్లయితే, అమెజాన్ అందిస్తున్న ఈ లేటెస్ట్ బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ఆఫర్ పైన ఒక లుక్కేయండి.
రియల్ మి నార్జో 60 ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరతో అమేజాన్ నుండి సేల్ చేయబడుతోంది. అయితే, అమేజాన్ ఈ ఫోన్ పైన ఈరోజు రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 11,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందుకునే వీలుంది. Buy From Here
Also Read : Poco X6 Series Launch: జనవరి 11 న వస్తున్న పోకో కొత్త ఫోన్లు.!
రియల్ మి నార్జో 60 ఎక్స్ 5జి స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ కేటగిరిలో 33W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. ఇందులో, 5000mAh బ్యాటరీ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఈ ఫోన్ చాలా సన్నగా డిజైన్ చెయ్యబడింది మరియు మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6100+ తో పనిచేస్తుంది మరియు డైనమిక్ RAM ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ని లో లైట్ పెర్ఫార్మన్స్ తో అందించింది. రియల్ మి నార్జో 60 ఎక్స్ 5జి ఫోన్ లో 6.72 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ తో కలిగి వుంది. అంతేకాదు, ఈ రియల్ మి ఫోన్ 128GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడాక్లైగ్ ఉంటుంది కలిగి ఉంటుంది.