అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరో రెండు రోజుల్లో స్టార్ట్ అవనున్నది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభ మవుతుంది మరియు ప్రైమ్ సభ్యుల కోసం ఒకరోజు ముందుగానే యాక్సెస్ అంధిస్తుంది. అయితే, ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ నుండి iPhone 12 పైన అమెజాన్ దిమ్మతిరిగే డీల్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం ఇదొక్కటే కాదు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అనేక మొబైల్ లను భారీ డిస్కౌంట్ తో చవక ధరకే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
ఇక అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ నుండి అఫర్ చేయబోతున్న కొన్ని డీల్స్ గురించి ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అమెజాన్ ఈ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, iPhone 12 పైన బిగ్ డీల్ ను అఫర్ చేయబోతున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఇందులో, ఐఫోన్ 12 ను 3X,XXX అఫర్ ధరతో చూపిస్తోంది. అంటే, ఈ సేల్ నుండి యాపిల్ ఐఫోన్ 12 ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే పొందే అవకాశం ఉండవచ్చేమో. Check Offers Here
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను జతచేసింది. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile