అమెజాన్ సేల్ లాస్ట్ డే నుండి Samsung Galaxy S22 5G పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Samsung Galaxy S22 5G పైన భారీ డిస్కౌంట్

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి రూ.23,000 భారీ డిస్కౌంట్

Samsung ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

అమెజాన్ సేల్ లాస్ట్ డే నుండి Samsung Galaxy S22 5G పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.72,999 ప్రారంభ ధరతో ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి స్మార్ట్ ఫోన్, అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి రూ.23,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.49,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనేవారికి రూ.14,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. మొత్తంగా చూస్తే, ఈ Samsung ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది.   

Bank Offer: శామ్సంగ్ గెలాక్సీ S22 5G స్మార్ట్ ఫోన్ Citi,ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here    

Samsung Galaxy S22 5G: ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది.  ఈ Galaxy S22 ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు 4nm ప్రోసెసర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ఉన్న కెమెరాతో 8K లో వీడియోలను రికార్డ్ చెయవచ్చు. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 3,700 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :