Realme GT 6T 5G ఫోన్ పై అమెజాన్ రూ. 6,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

Realme GT 6T 5G పై అమెజాన్ ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్ ను అనౌన్స్ చేసింది

ఈరోజు అమెజాన్ నుంచి రూ. 6,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకు లభిస్తుంది

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది

Realme GT 6T 5G ఫోన్ పై అమెజాన్ రూ. 6,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Realme GT 6T 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్ ను అనౌన్స్ చేసింది. 1.5Mn AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ చిప్స్ సెట్ మరియు గొప్ప కెమెరా సెటప్ కలిగిన ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 6,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకు లభిస్తుంది. ఈ రియల్ మీ లేటెస్ట్ ఫోన్ ను 22 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme GT 6T 5G : అమెజాన్ ఆఫర్

రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ వేరియంట్ ఇండియన్ మార్కెట్లో రూ. 32,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 28,998 లిమిటెడ్ పీరియడ్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై అమెజాన్ ప్రస్తుతం ఈరోజు రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 23,998 రూపాయల ధరకే లభిస్తుంది.

అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ ప్లాట్ ఫామ్ పై DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ పై రూ. 6,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 22,498రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: Amazon EPL Sale నుంచి 650W 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Realme GT 6T 5G : ఫీచర్స్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ 1.5Mn AnTuTu స్కోర్ అందిస్తుంది మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 8T LTPO స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1Hz – 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

Realme GT 6T 5G

ఈ ఫోన్ లో 50MP (Sony LYT-600) మెయిన్ కెమెరా మరియు 8MP (Sony IMX355 8MP) డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP (Sony IMX615) సెల్ఫీ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ 4K@60fps వీడియో సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 120W SUPERVOOC సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo