APPLE iPhone 12: ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

APPLE iPhone 12 ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

ఆపిల్ ఐఫోన్ 12 ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే ఛాన్స్

ఆపిల్ ఐఫోన్ 12 పైన లభిస్తున్న ఆఫర్లు మరియు డీల్స్

APPLE iPhone 12 ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే ఛాన్స్ ఇప్పుడు మీ ముందు ఉన్నది. వాస్తవానికి, ఆపిల్ ఫోన్లలో ఐఫోన్ 12 ఫోన్ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ గా చెబుతారు. ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన డ్యూయల్ కెమెరా మరియు పెద్ద డిస్ప్లే వంటివి ఈ ఫోన్ ను ఎంచుకునేలా ఉసిగొల్పుతాయి. ఈ ఆపిల్ ఐఫోన్ 12 పైన లభిస్తున్న ఆఫర్లు మరియు డీల్స్ ఏమిటో చూద్దామా. 

APPLE iPhone 12: ధర మరియు ఆఫర్లు

ఆపిల్ ఐఫోన్ 12 బేసిక్ వేరియంట్ ఇండియాలో రూ.79,900 ధరతో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి 29,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.50,900 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను Amex మరియు Standard Chartered బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన అతిభారీ ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ల ను కూడా అందిస్తోంది. Buy From Here

APPLE iPhone 12: స్పెక్స్

ఐఫోన్ 12 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు  స్క్రాచ్-రెసిస్టెంట్ సిరామిక్ గ్లాస్ ని కూడా ఆపిల్ ఈ ఫోన్లలో అందించింది. ఈ ఆపిల్ ఫోన్  A14 బయోనిక్ చిప్ శక్తితో పనిచేస్తుంది.

ఇక కెమెరా పరంగా, ఐఫోన్ 12 ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 12MP వైడ్ కెమెరాకి జతగా 12 MP అల్ట్రా-వైడ్ కెమెరా వుంది. ఈ రియర్ కెమెరాతో Dolby Vision HDR రికార్డింగ్ అవకాశం వుంది. ముందు భాగంలో, ఫేస్ ఐడితో పాటు 12MP సెల్ఫీ కెమెరా ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :