Redmi K50i 5G పైన భారీ అఫర్ ప్రకటించిన అమెజాన్

HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ కిక్ స్టారర్ డీల్స్ సేల్

Amazon Redmi K50i 5G పైన భారీ ఆఫర్లను ప్రకటించింది

మిడ్ రేంజ్ ధరలో Dolby Vision సపోర్ట్ తో వచ్చిన షియోమీ స్మార్ట్ ఫోన్

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ కిక్ స్టారర్ డీల్స్ సేల్ నుండి Redmi K50i 5G పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. మిడ్ రేంజ్ ధరలో Dolby Vision సపోర్ట్ తో వచ్చిన ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుండి 4,000 రూపాయల వరకూ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లతో కేవలం 21, 999 రూపాయలకే ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అందుకునే ఛాన్స్ దక్కుతుంది. ఇంకెదుకు ఆలశ్యం రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్లతో తక్కువ ధరలో అందుకే ఈ అఫర్ వివరాలేమిటో చూద్దాం పదండి.

Redmi K50i 5G: ధర మరియు ఆఫర్లు

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్/128GB స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ ధర రూ.25,999. అలాగే, 8GB ర్యామ్/256GB స్టోరేజ్ కలిగిన హై ఎండ్ మోడల్ ధర రూ.28,999. ఈరోజు అమెజాన్ నుండి మొదలైన కిక్ స్టారర్ డీల్స్ నుండి ఈ ఫోన్ పైన మంచి ఆఫర్లు అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 1,500 రూపాయల కూపన్ అఫర్ మరియు 2,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. Buy From Here

Redmi K50i 5G: స్పెక్స్

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన లిక్విడ్ FFS డిస్ప్లేని కలిగివుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది HDR 10 మరియు Dolby Vision లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5nm ప్రాసెసర్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను అన్ని సమయాల్లో చల్లబరిచేందుకు లిక్విడ్ కూల్ 2.0 ఫీచర్ ను కూడా అందించింది.

ఆప్టిక్స్ పరంగా, K50i 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు మ్యాక్రో కెమెరా   వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన MIUI 13 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :