iQOO Z6 Lite 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరకే కొనాలని చేస్తున్న వారికి గుడ్ న్యూస్

iQOO Z6 Lite 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన అమెజాన్

లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరకే కొనాలని చేస్తున్న వారికి గుడ్ న్యూస్. iQOO Z6 Lite 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన అమెజాన్. ఈ ఆఫర్ల ద్వారా ఈ లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ డ్యూయల్ 5G సపోర్ట్ తో పాటుగా 50MP డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లతో వస్తుంది.       

iQOO Z6 Lite 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 2,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ 11,999 రూపాయల అతితక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

iQOO Z6 Lite 5G: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 1GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :