అమెజాన్ సేల్ నుండి Redmi K50i 5G పైన బిగ్ డీల్స్.!

Updated on 12-Apr-2023
HIGHLIGHTS

షియోమీ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్

Redmi K50i స్మార్ట్ ఫోన్ పైన భారీ కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి షియోమీ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. అమెజాన్ తన పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి Redmi K50i స్మార్ట్ ఫోన్ పైన భారీ కూపన్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. తద్వారా, రెడ్ మీ కె50i స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి Redmi K50i పైన అందించిన అఫర్లను తెలుసుకోండి.

Redmi K50i 5G: ధర మరియు ఆఫర్లు

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్/128GB స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ అమెజాన్ సేల్ నుండి 1,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.24,999 ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన అమెజాన్ 1000 రూపాయల కూపన్ అఫర్ మరియు SBI కార్డ్స్ తో కొనేవారికి 3,000 రూపాయల డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అంటే, ఈ ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ.20,999 రూపాయలకే పొందవచ్చు. Buy From Here

Redmi K50i 5G: స్పెక్స్

రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన లిక్విడ్ FFS డిస్ప్లేని కలిగివుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది HDR 10 మరియు Dolby Vision లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5nm ప్రాసెసర్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను అన్ని సమయాల్లో చల్లబరిచేందుకు లిక్విడ్ కూల్ 2.0 ఫీచర్ ను కూడా అందించింది.

ఆప్టిక్స్ పరంగా, K50i 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు మ్యాక్రో కెమెరా   వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన MIUI 13 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :