amazon offers big deals on QOO Neo 10R 5G today
iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ అందించి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. క్వాల్కమ్ ప్రీమియం చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ సైతం ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. 25 వేల బడ్జెట్ ధరలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ కోరుకునే యూజర్లు ఈ బెస్ట్ డీల్ పరిగణలోకి తీసుకోవచ్చు.
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది.
ఈ ఫోన్ యొక్క మిడ్ వేరియంట్ రూ. 26,998 ధరతో లిస్ట్ అవ్వగా దీనిపై రూ. 2,500 డిస్కౌంట్ తో రూ. 24,498 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ అయిన 12GB RAM + 256GB వేరియంట్ కూడా రూ. 5,000 డిస్కౌంట్ మరియు రూ. 2,500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 26,498 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 17 లక్షల AnTuTu స్కోర్ కలిగిన క్వాల్కమ్ ప్రీమియం చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 తో పని చేస్తుంది. ఇందులో 8GB / 12GB LPDDR5X ర్యామ్ మరియు 128GB / 256GB UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78 బిగ్ ఫ్లాట్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.5K రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. అంతేకాదు ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: ఇక గూగుల్ ఫొటోస్ లో కూడా AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్ Nano Banana వచ్చేస్తోంది.!
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఇంట సన్నని డిజైన్ లో కూడా 6400 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.