అమెజాన్ ఇండియా జూన్ 7వ తేదీ నుండి ప్రకటించిన 'మాన్సూన్ కార్నివాల్' సేల్ నుండి గొప్ప ఆఫర్లను అందించింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి షియోమీ కొత్త 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 10T 5G భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఆఫర్లతో ఈ ఫోన్ ను మీరు కేవలం 10 వేల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ప్రొసెసర్ Dimensity 700 SoC మరియు 48MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది.
ముందుగా, రూ.13,999 రూపాయల ధరతో వచ్చిన రెడ్‌మి నోట్ 10 టి యొక్క 4జిబి మరియు 64జిబి స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్ 2,000 రూపాయల డిస్కౌంట్ తో నుండి కేవలం రూ.11,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన 500 రూపాయల కూపన్ అఫర్ ను కూడా అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, Citi మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్లతో కొనేవారికి ఈ ఫోన్ 10 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here
రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, క్రోమియం వైట్, మింట్ గ్రీన్ మరియు మెటాలిక్ బ్లూ అనే నాలుగు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
రెడ్‌మి నోట్ 10 టి యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు 22.5W ఫాస్ట్ చార్జర్ బాక్స్ తోపాటుగా వస్తుంది.