AMAZON గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన బిగ్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ నుండి  మంచి స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్ తో పాటుగా మంచి డీల్స్ ను కూడా అఫర్ చేస్తోంది. మీరు ఈ సేల్ నుండి పొందనున్న డీల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లేదా గొప్ప స్మార్ట్‌ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ఈ డీల్స్ ఒకసారి పరిశీలించవచ్చు. మేము ఈ రోజు కొన్ని గొప్ప స్మార్ట్‌ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ వివరాలు అందిస్తున్నాను.

OnePlus 7 T  (8GB + 128 GB )

MRP : రూ 37999

డీల్ ధర: రూ .34999

వన్‌ ప్లస్ 7 టి స్మార్ట్‌ ఫోన్ నేటి సేల్ నుండి రూ .34999 కు లభిస్తుంది మరియు ఈ ఫోన్ను నో కోస్ట్ ఇఎంఐ ద్వారా నెలకు రూ. 5833 చొప్పున కొనుగోలు చేయవచ్చు, ఇది 6 నెలలు ఉంటుంది. ఇది కాకుండా, SBI క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీని యొక్క ముఖ్య ఫీచర్దాని 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.

Redmi Note 8 (4GB + 64GB)

MRP : రూ .12999

డీల్ ధర: రూ .9999

నాలుగు కెమెరాలతో బడ్జెట్ ధరలో వచ్చినటువంటి,  రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ ఫోన్ ఈ రోజు 9999 రూపాయలకు అమ్మబడుతోంది. ఈ ధర 4GB + 64GB వేరియంట్‌ కోసం గరిష్టంగా  రూ .12999 రిటైల్ ధర చెయ్యబడింది.

Redmi Note 8 Pro (6GB + 64GB)

MRP : రూ .16999

డీల్ ధర: రూ .13999

రెడ్మి నోట్ 8 ప్రో గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఈ రోజు 13999 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో, ఈ ఫోన్ను 1000 రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, SBI  క్రెడిట్ కార్డ్ కొనుగోలుపై 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా అన్ని ఆఫర్లు కలగలిపీ, ఈ స్మార్ట్ ఫోన్ ఏ సేల్ నుండి అతితక్కువ ధరకు లభిస్తుంది. 

శామ్సంగ్ గెలాక్సీ M 30 s (4GB + 64GB)

MRP : రూ .15500

డీల్ ధర: రూ .12999

శామ్సంగ్ గెలాక్సీ M 30 s ను ఈ అమెజాన్ సెల్‌ నుండి రూ .12999 కు విక్రయిస్తున్నారు. ఆరునెలల నో కోస్ట్ ఇఎంఐ ద్వారా ఈ ఫోన్ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు నెలకు రూ .2167 చెల్లించాలి. ఈ స్మార్ట్‌ ఫోనులో బలమైన 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48MP  క్వాడ్ కెమెరా ఉన్నాయి. SBI  క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M 10 s (3GB  + 32GB)

MRP: రూ .10000

డీల్ ధర: రూ .7999

శామ్సంగ్ గెలాక్సీ ఎం 10s నేటి అమ్మకంలో రూ .7999 కు లభిస్తుంది. మీరు ఈ ఫోన్ను SBI  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ను 9 నెలల నో కోస్ట్ ఇఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు, దీనికి మీరు నెలకు రూ .888 చెల్లించాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :