2020 అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్ అందుకోండి

HIGHLIGHTS

SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో చేసిన కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది.

2020 మొదలవుతుండగానే, అమెజాన్ ఇండియా తన మొదటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 19 వతేదికి మొదలయ్యి, జనవరి 22 వతేదికి ముగుస్తుంది. అయితే, అమెజాన్ యొక్క Prime Members మాత్రం ముందురోజు, అంటే జనవరి 18 వ తేదీ మద్యహ్నం 12 గంటల నుండే ఈ సేల్ యొక్క యాక్సెస్ ను పొందుతారు. అమెజాన్ ఇండియా ఈ సేల్ ను SBI బ్యాంక్‌ యొక్క భాగస్వామ్యంతో జరపనుంది. ఇందులో భాగంగా, కొనుగోలుదారులు SBI బ్యాంకు  క్రెడిట్ కార్డుతో చేసిన కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సేల్ సమయంలో, మీరు స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్‌ల పైన గొప్ప డీల్స్  మరియు ఆఫర్లను పొందుతారు.

ఈ సేల్ సమయంలో, అనేకమైన బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల పైన గరిష్టంగా 40% వరకు తగ్గింపు లభిస్తుంది మరియు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, NoCost  EMI మొదలైన ప్రయోజనాలు కూడా చేర్చబడతాయి. అలాగే,  ఆపిల్, షావోమి , వన్‌ప్లస్, శామ్‌సంగ్, వివో, హానర్ వంటి బ్రాండ్ల ఫోన్ల పైన మంచి డీల్స్ అందించబడతాయి.

ఇ-కామర్స్ దిగ్గజం గృహోపకరణాల పైన గరిష్టంగా  80% వరకు తగ్గింపుతో పాటు NoCost  EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇన్స్టాలేషన్ వంటివి అఫర్ చేస్తోంది.

అమేజాన్ యొక్క ఈ సేల్ నుండి మీరు డిజిట్ జీరో 1 అవార్డు గెలుచుకున్న ప్రొడక్స్ట్ ను ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పైన డిజిట్ జీరో 1 అవార్డును సొతం చేసుకున్న స్మార్ట్ ఫోన్ల కోసం ఒక ప్రత్యేకమైన పేజీని కూడా అందించింది. ఇందులో 2019 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితాను కూడా మీరు చూడవచ్చు.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :