Amazon GIF Sale started today for prime members
అమెజాన్ అతిపెద్ద సేల్ Great Indian Festival Sale ఈరోజు Prime Members కోసం స్టార్ట్ అయ్యింది. ఈ అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన ఈ సేల్ రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రైమ్ మెంబర్స్ కి ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. రేపు అర్ధరాత్రి నుంచి ఈ సేల్ అందరికి Live అవుతుంది. అయితే, ఈ రోజు ప్రైమ్ మెంబర్స్ కోసం భారీ డీల్స్ అందించింది. ఈరోజు అమెజాన్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అందించింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం ఈ ప్రత్యేకమైన డీల్ ను అందించింది. 2024 లో LG లాంచ్ చేసిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘UR7500P’ ఈరోజు 41% భారీ డిస్కౌంట్ తో రూ. 40,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ను కూడా అందించింది. అంతేకాదు, అమెజాన్ సేల్ నుంచి ఈరోజు SBI కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ.1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ అన్ని ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ సేల్ నుంచి కొనుగోలు చేసే ప్రైమ్ మెంబర్స్ 38 వేల కంటే తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం వుంది. Buy From Here
Also Read: Amazon GIF Sale ఈరోజు ప్రైమ్ మెంబెర్స్ కోసం మొదలైంది: LG స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ అందించింది.!
ఈ స్మార్ట్ టీవీ 4K UHD స్క్రీన్ తో వస్తుంది మరియు 3840×2160 రిజల్యూషన్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది. ఈ టీవీ 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ అందిస్తుంది మరియు 4K Upscaler ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ LG స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే స్పీకర్లు మరియు AI Sound (వర్చువల్ 5.1) సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.