ప్రైమ్ మెంబర్స్ కు మొదలైన అమెజాన్ GIF సేల్..iPhone12 పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం మొదలయ్యింది

2022 పండుగ సీజన్ కోసం అమెజాన్ తీసుకొచ్చిన అతిపెద్ద సేల్ Amazon GIF 2022

ఈ సేల్ నుండి iPhone 12 పైన భారీ డీల్స్ ను అఫర్ చేస్తోంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం మొదలయ్యింది. 2022 పండుగ సీజన్ కోసం అమెజాన్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద సేల్ రేపటి నుండి ప్రారంభ మవుతుంది. అయితే, ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒకరోజు ముందుగానే ఈ సేల్ కోసం అమెజాన్ యాక్సెస్ అందిస్తుంది. అందుకే, ఈరోజు నుండే ప్రైమ్ మెంబర్స్ ఈ సేల్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం మొదలైన ఈ సేల్ నుండి iPhone 12 పైన భారీ డీల్స్ ను అఫర్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఐఫోన్ 12 ను భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందవచ్చు.

iPhone 12: అఫర్ ధరలు

యాపిల్ iPhone 12 (64GB) ను ఇండియాలో రూ.79,900 రూపాయల ప్రారంభ ధరతో యాపిల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 36,900 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.42,999 రూపాయల ధరకే సేల్ చేస్తోంది. అలాగే, iPhone 12 (128GB) మోడల్ రూ.47,999 అఫర్ ధరతో మరియు iPhone 12 (256GB) మోడల్ ను రూ.57,999 అఫర్ ధరతో అందిస్తోంది. Buy From Here 

ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ నుండి మీరు No Cost EMI అఫర్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అన్ని ఆఫర్లు వెరసి, ఈ యాపిల్ ఐఫోన్ చాలా చవక ధరకే లభిస్తుంది.

iPhone 12: ప్రత్యేకతలు

యాపిల్ iPhone 12 పెద్ద 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తుంది. ఇది బలమైన సిరామిక్ షీల్డ్ తో కఠినమైన గ్లాస్ రక్షతో ఉంటుంది. ఈ ఫోన్ A14 Bionic చిప్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక 12MP డ్యూయల్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ కెమెరాతో 60fps వద్ద 4K Dolby Vision HDR వీడియోలను షూట్ చేయవచ్చు మరియు ట్రూ లైఫ్ ఫోటోలను కూడా పొందవచ్చు. అలాగే, ముందుగా భాగంలో కూడా 12MP ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :