amazon gff sale offers rs 10000 big discount on iPhone 16e phone
iPhone 16e స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప డీల్ అందుబాటులో ఉంది. యాపిల్ యొక్క ఈ లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ నుండి బడ్జెట్ ధరలో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ తో లభిస్తుంది. అమెజాన్ GFF Sale అందించిన ఈ జబర్దస్త్ డీల్ ఏమిటో తెలుసుకుందామా.
ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 59,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఫోన్ రూ. 10,000 డిస్కౌంట్ అందుకుని రూ. 49,999 ధరలో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ SBI క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ ఆఫర్ తో ఈ ఐఫోన్ రూ. 48,999 ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఆఫర్ చెక్ చేయడానికి లేదా ఆఫర్ ధరతో ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి Buy From Here పై నొక్కండి.
ఈ బడ్జెట్ ఐఫోన్ ధరలో తక్కువ అయినా 16 సిరీస్ కలిగిన అన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది, ఒక్క డ్యూయల్ కెమెరా తప్ప. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 16 సిరీస్ ఫోన్లు కలిగిన అదే బయోనిక్ A18 చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 128 జీబీ మరియు 512 జీబీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ యాపిల్ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు సిరామిక్ షీల్డ్ తో చాలా పటిష్టంగా ఉంటుంది.
ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 2 ఇన్ వన్ కెమెరా సిస్టం ఉంటుంది మరియు ఇందులో 48MP సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది 2x ఆప్టికల్ జూమ్ మరియు అన్ని యాపిల్ కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇందులో రెండవ కెమెరా లేదనే చిన్న లోటు తప్ప, ఈ ఫోన్ కెమెరా అన్ని పనులు నిర్వహిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఐఫోన్ 16e దాదాపు 26 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: అమెజాన్ GFF Sale నుంచి 11 వేల ధరలోనే boAt Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఈ లేటెస్ట్ ఐఫోన్ ను ఈరోజు మీరు అమెజాన్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.