ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ నుండి iQOO Z6 5G పైన భారీ ఆఫర్లు.!

Updated on 28-Jun-2022
HIGHLIGHTS

iQOO Z6 5G పైన అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది

ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ ద్వారా ఐకూ Z6 5G మంచి ఆఫర్లతో లభిస్తోంది

అమెజాన్ కూపన్ అఫర్ మరియు బ్యాంక్ అఫర్ వంటి ఇతర లాభాలను కూడా పొందవచ్చు

iQOO ఇటీవల ప్రకటించి బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 5G పైన అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈరోజు నుండి మొదలైన ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ ద్వారా ఐకూ Z6 5G మంచి ఆఫర్లతో లభిస్తోంది. మార్చి 2022 లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ రూ.15,999 రూపాయల ధరతో ప్రకటించించగా ఈ సేల్ నుండి 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ తో రూ.15,499 రూపాయల ధరతో లభిస్తోంది. అలాగే, అమెజాన్ కూపన్ అఫర్ మరియు బ్యాంక్ అఫర్ వంటి ఇతర లాభాలను కూడా పొందవచ్చు.         

iQOO Z6: ధర

ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ఈ సేల్ నుండి కేవలం రూ.15,999 రూపాయల ధరతో లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ పైన 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI అప్షన్ తో కొనేవారికి 1,000 రూపాయలు, EMI అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల తగ్గింపు అఫర్ వర్తిస్తుంది. Buy From Here

iQOO Z6: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 6 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 1445 mm² 5-లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా  2MP మ్యాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :