గత వారం లో రిలయన్స్ JIO నుంచి 4జి ఫోన్ లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. ఈ 4జి ఫోన్ రాకతో గత కొంతకాలంగా టెలికామ్ మార్కెట్ లో కొంతవరకు చల్లారిన వేడి ఈ ఫోన్ రాకతో మళ్ళీ టెలికామ్ వర్గాల మద్య అగ్గి రాజుకుంటుంది. మళ్ళీ యూజర్స్ అందరూ JIO వైపు మొగ్గు చూపుతూ ఉండటం తోమిగతా కంపెనీ లు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాయి . వాటిలో భాగం గానే నిన్నే ఐడియా నుంచి తన 4జి ఫోన్ ను 2,500 రూ కి వస్తుందని సమాచారం వచ్చింది . అయితే టెలి కామ్ కామ్ దిగ్గజమైన భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఎలా అయినా తానే NO 1 గా నిలబడాలనే ఉద్దేశ్యం తో సరికొత్త నిర్ణయం తీసుకుంది . అందుకే JIO 1500 రూ ఫీచర్ ఫోన్ కి కాంపిటీటర్ గా తానూ కూడా ఫీచర్ ఫోన్ ని ప్రవేశపెట్టనుంది . అయితే ఒక వెబ్సైట్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోన్ కాస్ట్ JIO ఫోన్ కంటే కూడా తక్కువే నట . కేవలం 1000 రూపీస్ యూజర్స్ కి ఇవ్వనుంది . అయితే దీనిలో కట్టిన అంమౌంట్ JIO మాదిరిగా 3 ఏళ్ల తరువాత ఇస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి