Ai Plus Smartphones price starts from rs 5000 company teasing with price
Ai Plus Smartphone: ఇండియాలో మొదటిసారిగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న కొత్త కంపెనీ ఎఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈరోజు తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ కొత్త కంపెనీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ తో లాంచ్ టీజింగ్ చేస్తోంది. అయితే, వీటిలో బడ్జెట్ ఫోన్ గా చెప్పబడుతున్న Pulse స్మార్ట్ ఫోన్ ప్రైస్ కేవలం రూ. 5,000 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది.
ఇండియాలో ఎఐ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ జూలై 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు లాంచ్ అవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ Flipkart Unique గా వస్తున్నాయి మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతాయి. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
ఫ్లిప్ కార్ట్ నుంచి ఎఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కేవలం రూ. 5,000 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అవుతుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ కంపెనీ లాంచ్ చేస్తున్న పల్స్ 5జి స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. అయితే, ఇది డిస్కౌంట్ ఆఫర్స్ కలిసి ఉంటుందా లేక నేరుగా ఇదే ప్రైస్ తో లాంచ్ చేస్తుందా అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: OnePlus Nord 5: ప్రత్యేకమైన AI బటన్ మరియు Snapdragon చిప్సెట్ తో లాంచ్ అవుతుంది.!
కంపెనీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇండియా యూజర్స్ కోసం ఇండియాలో డిజైన్ చేయబడిన ఫోన్ గా కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో అందించిన కెమెరా వివరాలు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు వాటర్ డ్రాప్ డిజైన్ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు దానికి తగిన ఫాస్ట్ చార్ట్ సపోర్ట్ కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ డేటా బేస్ పూర్తిగా ఇండియాలో నిర్వహించడుతుందిట. అంటే, మీ డేటా పూర్తిగా ఇండియాలో స్టోర్ అవుతుంది మరియు సెక్యూర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ నాటి కంటే ముందే మరిన్ని ఫీచర్స్ కూడా వెల్లడించే అవకాశం వుంది. ఇది 4G స్మార్ట్ ఫోన్ గా మార్కెట్ లో అడుగుపెడుతుంది.