1 year unlimited 4G ఇంటర్నెట్ ఆఫర్ తో LYF ఫోన్స్ : రిపోర్ట్స్

రిలయన్స్ సొంత బ్రాండ్ LYF యొక్క స్మార్ట్ ఫోనులను కొంటే 1 ఇయర్ పాటు unlimited 4G ఇంటర్నెట్ వస్తుంది అని రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. సో ఫోన్ కొనే ఆలోచనలో ఉన్న వారు రెండు రోజులు ఆగి కొంటె బెటర్. ఎందుకంటే రిపోర్ట్స్ నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.. నిజమైతే ఆఫర్ బాగుంది అని చెప్పాలి.

ముందుగా ఈ విషయాన్నీ ఫోన్ రాడార్ సైట్ వెల్లడించగా, దీనిపై అఫీషియల్ గా మాత్రం కంపెని ఎక్కడా ఎటువంటి సమాచారం తెలియజేయలేదు. అయితే త్వరలోనే కంపెని ఈ వన్ ఇయర్ ఆఫర్ ను అనౌన్స్ చేస్తుంది అని రిపోర్ట్స్.

 ఈ ఆఫర్ లో కేవలం 4G డేటా మాత్రమే ఉంటుంది, unlimited కాల్స్ మరియు SMS ఉండవు. డేటా కూడా నెలకు 75GB లిమిట్ తో వస్తుంది అని రిపోర్ట్స్. LYF నుండి వచ్చే ఫోనుల్లో, బేసిక్ ప్రైస్ కలిగి ఫోన్ ధర  2,999.

LYF బ్రాండ్ లో ఉన్న కంప్లీట్ ఫోన్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు. అన్ని బ్రాండ్స్ Jio తో పార్టనర్ అయ్యి ఫోనులను రిలీజ్ చేస్తున్నాయి కనుక రిలయన్స్ సొంత ఫోనులకు మరింత బెటర్ ఆఫర్ ఉండాలని ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

3 నెలల ప్రివ్యూ ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి – కంప్లీట్ డిటేల్స్ ఈ లింక్ లో వ్రాసాను చూడగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :