JioBook 11(2023): అతి తక్కువ ధరలో ల్యాప్ టాప్ లాంచ్ చేసిన అంబానీ.!

HIGHLIGHTS

రిలయన్స్ చవక ధరలో ల్యాప్ ట్యాప్ లాంచ్ చేసి మరొకసారి వార్తల్లోకి ఎక్కిం

JioBook 11(2023) పేరుతో ఈ ల్యాప్ టాప్ ను భారతీయ మార్కెట్ లో విడుదల చేసింది

రిలయన్స్ యొక్క ఈ ల్యాప్ టాప్ 11.6 ఇంచ్ HD డిస్ప్లేని కలిగి వుంది

JioBook 11(2023): అతి తక్కువ ధరలో ల్యాప్ టాప్ లాంచ్ చేసిన అంబానీ.!

రిలయన్స్ చవక ధరలో ల్యాప్ ట్యాప్ లాంచ్ చేసి మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. JioBook 11(2023) పేరుతో అతితక్కువ ధరలో ఈ ల్యాప్ టాప్ ను భారతీయ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ల్యాప్ టాప్ Reliance Digital నుండి సేల్ కి అందుబాటులో కూడా ఉంచింది. ఈ ల్యాప్ టాప్ JioOS పైన పని చేస్తుంది మరియు 4G VoLTE సపోర్ట్, HD డిస్ప్లే మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ జియోబుక్ 11(2023) కంప్లీట్ ఇన్ఫర్మేన్షన్ తెలుసుకుందాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JioBook 11(2023): ధర 

రిలయన్స్ ఈ JioBook 11(2023) ను రూ. 16,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ల్యాప్ టాప్ పైన అతితక్కువ EMI అఫర్ ను కూడా రిలయన్స్ జత చేసింది. ఈరోజు నుండి ఈ JioBook 11(2023) ను రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ ద్వారా Pre-Order కోసం అందుబాటులో వుంది.

JioBook 11(2023) : ప్రత్యేకతలు 

రిలయన్స్ యొక్క ఈ ల్యాప్ టాప్ 11.6 ఇంచ్ HD డిస్ప్లేని కలిగి వుంది. జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం 900 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉండేలా డిజైన్ చేసింది మరియు చాలా స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ జియోబుక్ 11 మీడియాటెక్ MT8788 (2.0 GHz) ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో 4GB LPDDR4 ర్యామ్ మరియు 64GB eMMC ఇంటర్నల్ స్టోరేజ్ అందుతాయి. అయితే, మీరు కోరుకుంటే ఈ మెమోరిని 256GB వరకూ పెంచుకోవచ్చు. 

ఈ జియో ల్యాప్ టాప్ 4G LTE మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సప్పర్ట్ తో Always On ఇంటర్నెట్ తో వస్తుంది. రిలయన్స్ ఈ ల్యాప్ టాప్ ని JioOS తో అందించింది మరియు మల్టీ విండో సపోర్ట్ తో మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. ఇందులో పెద్ద ట్రాక్ ప్యాడ్ కలిగిన ఇన్ఫినిటీ కీబోర్డు, 2MP HD వెబ్ క్యామ్, వైర్ లెస్ ప్రింటింగ్, స్టీరియో స్పీకర్లు, 8 గంటలు పని చేయగల లిథియం అయాన్ బ్యాటరీ, MiniHDMI మరియు BT 5.0 సపోర్ట్ వంటి ప్రత్యేకతలతో ఈ జియో ల్యాప్ టాప్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo