Apple M5 chip తో వచ్చిన 14.2 ఇంచ్ MacBook Pro ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 15-Oct-2025
HIGHLIGHTS

ఈరోజు యాపిల్ సరికొత్త MacBook Pro 14 ఇంచ్ ని లేటెస్ట్ Apple M5 chip తో లాంచ్ చేసింది

ఇది ఆల్ న్యూ చిప్ తో పాటు న్యూ డిటైల్స్ కూడా కలిగి ఉంటుంది

ప్రస్తుతం ఈ మాక్ బుక్ ప్రో Pre Book కోసం అందుబాటులో ఉంది

మార్కెట్లో ఆపిల్ ప్రొడక్ట్స్ వస్తోందని చెబితే చాలు సర్వత్రా చర్చ మొదలవుతుంది. ఇది కేవలం ప్రైస్ గురించి మాత్రమే ఫీచర్స్ గురించి కూడా చర్చల్లో నిలుస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు యాపిల్ సరికొత్త MacBook Pro 14 ఇంచ్ ని లేటెస్ట్ Apple M5 chip తో లాంచ్ చేసింది. ఇది ఆల్ న్యూ చిప్ తో పాటు న్యూ డిటైల్స్ కూడా కలిగి ఉంటుంది. మరి ఈ కొత్త యాపిల్ బుక్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

MacBook Pro Apple M5 chip: ప్రైస్

మాక్ బుక్ ప్రో 14 ఇంచ్ ఇండియాలో రూ. 1,69,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 16 జీబీ యూనిఫైడ్ మెమరీ మరియు 512 జీబీ SSD స్టోరేజ్ కలిగి ఉంటుంది. మాక్ బుక్ ప్రో 16 జీబీ + 1TB SSD వేరియంట్ రూ. 1,89,900 ప్రైస్ ట్యాగ్ తో మరియు 24 జీబీ మరియు 1 జీబీ వేరియంట్ ను రూ. 2,09,900 ధరతో ఆఫర్ చేస్తోంది.

ఈ మాక్ బుక్ అక్టోబర్ 22వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ మాక్ బుక్ ప్రో Pre Book కోసం అందుబాటులో ఉంది. ఈ మాక్ బుక్ పై సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ రూ. 10,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.

Also Read: BSNL Diwali Bonanza: కేవలం రూపాయికే నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి!

MacBook Pro Apple M5 chip: ఫీచర్స్

ఈ మాక్ బుక్ ప్రో 14.2 ఇంచ్ లిక్విడ్ రెటీనా XDR స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 3024×1964 నేటివ్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది HDR with Dolby Vision, HDR10+ / HDR10 మరియు HLG వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది యాపిల్ M5 చిప్ తో పని చేస్తుంది మరియు గరిష్టంగా 24 జీబీ యూనిఫైడ్ మెమొరీతో ఉంటుంది. ఈ చిప్ 10-core CPU మరియు 10-core GPU ఆర్కెటిక్ పై ఉంటుంది. ఇందులో 16-core న్యూరల్ ఇంజిన్ మరియు 153GB/s బ్యాండ్ విడ్త్ ఉంటుంది.

ఈ మాక్ బుక్ H.264, HEVC, ProRes మరియు ProRes RAW మీడియా సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది 24 గంటల వీడియో స్ట్రీమింగ్ అందించే బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో 72.4 వాట్ అవర్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది మరియు దీన్ని వేగంగా ఛార్జ్ చేసే 70W USB-C ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో మూడు Thunderbolt 4 (USB-C) పోర్ట్స్, డిస్ప్లే పోర్ట్, మెగా సేఫ్ పోర్ట్ మరియు 3.5 ఆడియో జాక్, SDXC కార్డ్ స్లాట్ మరియు HDMI పోర్ట్ కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :