JioBook: జియో ల్యాప్ టాప్ విడుదల.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో ఎటువంటి హడావిడీ లేకుండా చాలా సైలెంట్ గా తన ల్యాప్ టాప్ ను విడుదల చేసింది

JioBook పేరుతొ తీసుకొచ్చిన ఈ ల్యాప్ టాప్ చాలా కాలంగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది

జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది

రిలయన్స్ జియో ఎటువంటి హడావిడీ లేకుండా చాలా సైలెంట్ గా తన ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. JioBook పేరుతొ తీసుకొచ్చిన ఈ ల్యాప్ టాప్ చాలా కాలంగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది మరియు ఎట్టకేలకు మార్కెట్లో విడుదల చెయ్యబడింది. JioBook ల్యాప్ టాప్ ను  గవర్నమెంట్ e-మార్కెట్ లో లిస్టింగ్ చేసినట్లు 91మొబైల్స్ ముందుగా సూచించింది. జియో జియొక్క ఈ మొట్టమొదటి ల్యాప్‌ టాప్ ధర, డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌ వంటి అన్ని అంశాలను పరిశీలిద్దాం పదండి.

JioBook: ఎలా వుంది?

ముందుగా, జియోబుక్ యొక్క డిస్ప్లేతో ప్రారంభిద్దాం. జియోబుక్ 11.6 ఇంచ్ డిస్ప్లేతో వుంది మరియు ఇది HD (1366×768) రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది LED బ్యాక్‌లైటింగ్‌తో కూడిన TN ప్యానెల్ మరియు యాంటీ-గ్లేర్ ఫీచర్ లను కలిగి ఉంది. జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు Adreno 610 GPU తో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  2GB LPDDR4x RAM మరియు 32GB eMMC స్టోరేజ్ తో వస్తుంది. మీరు కోరుకుంటే SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవచ్చు.

జియోబుక్ లేటెస్ట్ JioOS పైన నడుస్తుందని జియో తెలిపింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేక ఉండదా అనే విషయం పైన ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ యాడ్ బ్రౌజర్ వంటి కొన్ని ముందే ఇన్‌స్టాల్ చెయ్యబడిన యాప్‌లను మీరు ఈ ల్యాప్ టాప్ తో పొందుతారు మరియు జియో క్లౌడ్ PC కి కూడా సపోర్ట్ ఉంది.

ఇక ఇతర ఫీచర్లు మరియు కనెక్టివిటీ విషయానికి వస్తే, JioBook లో 4G సపోర్ట్, USB-A 2.0 పోర్ట్, USB-A 3.0 పోర్ట్, HDMI పోర్ట్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లు ఉన్నాయి. ఇక జాబితా చేయబడిన బ్యాటరీ పరిమాణం 55.1 నుండి 60 AH వరకు వుంటుంది మరియు ఇది 8 గంటల వరకుబ్యాకప్ ఇస్తుందని చెబుతోంది. ఈ జియో ల్యాప్ టాప్ లో మీరు డ్యూయల్ స్పీకర్ సెటప్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మైక్ సెటప్ మరియు స్టాండర్డ్ నో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా పొందుతారు.

JioBook: ధర ఎంత?

JioBook యొక్క రూ.19,500 అయినప్పటికీ, ఈ ధర ఆఫర్ ధర గా ట్యాగ్‌ చేయబడింది. ఇది ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్లేస్ (GeM) నుండి గుర్తించబడింది. అయితే, పై స్క్రీన్‌షాట్ ప్రకారం కేవలం 10 యూనిట్లు మాత్రమే స్టాక్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :