జియో ల్యాప్ టాప్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి.!

Updated on 05-Feb-2023
HIGHLIGHTS

రిలయన్స్ జియో ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ల్యాప్ టాప్

JioBook ఇప్పుడు మంచి ఆఫర్లతో లభిస్తోంది

Reliance Digital Store నుండి 56% డిస్కౌంట్ లభిస్తున్న జియో ల్యాప్ టాప్

రిలయన్స్ జియో ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ల్యాప్ టాప్ JioBook ఇప్పుడు మంచి ఆఫర్లతో లభిస్తోంది. Reliance Digital Store నుండి 56% డిస్కౌంట్ లభిస్తున్న జియో ల్యాప్ టాప్ ను మీరు చవక ధరలో సొంతం చేసుకోవచ్చు. ఈ జియో ల్యాప్ టాప్ ను కేవలం రూ.759 అతి తక్కువ EMI చెల్లింపు పద్దతిలో కూడా పొందే అవకాశం కూడా మీకు అందించింది. మరి జియో ల్యాప్ టాప్ పైన అందుబాటులో వున్న ఆఫర్స్ మరియు డీల్స్ ఏమిటో తెలుసుకోండి.   

JioBook: అఫర్ ధర

JioBook ను ముందుగా రూ.19,500 ధరతో ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్లేస్ (GeM) లో లిస్టింగ్ చేసింది. అయితే, ఇప్పుడు జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.15,799 రూపాయల ధరతో సేల్ చేస్తోంది. జియోబుక్ ను Reliance digital Store నుండి పొందవచ్చు. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ ను అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా అతితక్కువ EMI తో కూడా లభిస్తుంది. ఈ అఫర్ కేవలం క్రెడిట్ కార్డ్స్ పైన మాత్రమే వర్తిస్తుంది.  

JioBook: స్పెక్స్ మరియు ఫీచర్స్

ముందుగా, జియోబుక్ యొక్క డిస్ప్లేతో ప్రారంభిద్దాం. జియోబుక్ 11.6 ఇంచ్ డిస్ప్లేతో వుంది మరియు ఇది HD (1366×768) రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది LED బ్యాక్‌లైటింగ్‌తో కూడిన TN ప్యానెల్ మరియు యాంటీ-గ్లేర్ ఫీచర్ లను కలిగి ఉంది. జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు Adreno 610 GPU తో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  2GB LPDDR4x RAM మరియు 32GB eMMC స్టోరేజ్ తో వస్తుంది. మీరు కోరుకుంటే SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవచ్చు.

జియోబుక్ లేటెస్ట్ JioOS పైన నడుస్తుందని జియో తెలిపింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేక ఉండదా అనే విషయం పైన ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ యాడ్ బ్రౌజర్ వంటి కొన్ని ముందే ఇన్‌స్టాల్ చెయ్యబడిన యాప్‌లను మీరు ఈ ల్యాప్ టాప్ తో పొందుతారు మరియు జియో క్లౌడ్ PC కి కూడా సపోర్ట్ ఉంది.

ఇక ఇతర ఫీచర్లు మరియు కనెక్టివిటీ విషయానికి వస్తే, JioBook లో 4G సపోర్ట్, USB-A 2.0 పోర్ట్, USB-A 3.0 పోర్ట్, HDMI పోర్ట్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లు ఉన్నాయి. ఇక జాబితా చేయబడిన బ్యాటరీ పరిమాణం 55.1 నుండి 60 AH వరకు వుంటుంది మరియు ఇది 8 గంటల వరకుబ్యాకప్ ఇస్తుందని చెబుతోంది. ఈ జియో ల్యాప్ టాప్ లో మీరు డ్యూయల్ స్పీకర్ సెటప్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మైక్ సెటప్ మరియు స్టాండర్డ్ నో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా పొందుతారు. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :