జియో యూజర్స్ కి దిమ్మదిరిగే గుడ్ న్యూస్

HIGHLIGHTS

రూ.5000కే జియో 4జి లాప్టాప్

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్ 
రూ.5000కే జియో 4జి  లాప్టాప్ 

JIO  యూజర్స్  అందరికి  ఒక శుభవార్త  ఇప్పటివరకు సామాన్య  మానవునికి  ఏ  టెలికాం  కంపెనీ  అందించని  ఎన్నో సేవలు ఇచ్చిన JIO  ఇప్పుడు మరో దారిలో తన కొత్త అడుగులు  వేస్తోంది  అది ఏమిటంటే  JIO  నుంచి లాప్టాప్  వస్తుంది .  అదికూడా  అతి చవకైన  ధరకు మనందరికీ  అతిత్వరలో అందుబాటులోకి  రానుంది. జియో ఇకోసిస్టం నుంచి  మార్కెట్లోకి  కొత్త  ప్రోడక్ట్  వస్తుంది. . అదే జియో బ్రాండెడ్ ల్యాప్‌టాప్.

 తాజాగా  వచ్చిన లీక్స్  ప్రకారం  డెడికేటెడ్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్‌తో రానున్న ఈ సరికొత్త జియో 4జీ ల్యాపీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుందని  సమాచారం  మరియు  దానికి  తగ్గట్టుగా  జియో యాప్ సూట్‌ను అప్‌డేట్ చేసారట. మరియు జియో 4జీ ల్యాప్‌టాప్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు  చేస్తుందని  చెబుతున్నారు . 
తాజాగా  వచ్చిన లీక్స్  ప్రకారం స్పెక్స్  గమనిస్తే 
13.3ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, చాక్లెట్ కీ స్టైల్ స్లిమ్ కీబోర్డ్, ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి eMMC స్టోరేజ్, 128జీబి SSD స్టోరే్జ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 4.0, మైక్రో యూఎస్బీ 3.0 పోర్ట్స్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఎస్డీ స్లాట్.

తాజాగా www.buyredmi.com/jiolaptop/ అనే వెబ్‌సైట్, జియో ల్యాప్‌టాప్‌లకు ప్రీ  బుకింగ్స్  మేమె  మొదలుపెడుతున్నామని  చెబుతుంది. 
5000 వేలకి  లభిస్తుందని  కొన్ని  సైట్స్  లో చెప్పబడింది.  వాటి ఆధారంగా  మేము మీకు  చెబుతున్నాము.  అయితే కంపనీ  దీని గురించి  ఇంకా  అఫిషియల్  అనౌన్స్మెంట్  చేయలేదు  

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :