apple launches MacBook Air new m4 chip know the price and details
Apple సరికొత్త MacBook Air మరియు మ్యాక్ స్టూడియో ని కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ను కొత్త మరియు పవర్ ఫుల్ M4 చిప్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఇది చాలా స్లీక్ డిజైన్ మరియు పవర్ ఫుల్ స్క్రీన్ ను కూడా కలిగి ఉంటుంది. దీనితో పాటు మరింత శక్తివంతమైన M4 Max మరియు M3 అల్ట్రా చిప్ లతో మ్యాక్ స్టూడియో కూడా లాంచ్ చేసింది.
మ్యాక్ బుక్ ఎయిర్ ను రెండు స్క్రీన్ సైజుల్లో అందించింది. ఇందులో 15 ఇంచ్ మరియు 13 ఇంచ్ ఉన్నాయి. మ్యాక్ బుక్ ఎయిర్ లో సరికొత్త 12MP సెంటర్ స్టేజ్ కెమెరా అందించింది. ఇది మ్యాక్ బుక్ ఎలా ఉన్నా యూజర్ ను అన్ని ఫ్రేమ్ లలో సెంట్రిగ్గా ఉంచుతుంది. మ్యాక్ బుక్ ఎయిర్ అల్యూమినియం యూనీ బాడీ తో వస్తుంది. ఇందులో 2560 x 1664 రిజల్యూషన్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంటుంది.
మ్యాక్ బుక్ ఎయిర్ యాపిల్ యొక్క కొత్త Apple M4 chip తో పని చేస్తుంది. ఇది 10 Core CPU మరియు ఇందులో 4 పెర్ఫార్మెన్స్ కోర్స్ మరియు 6 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. అంతేకాదు, ఇది 16-core న్యూరల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ బుక్ ఎయిర్ 53.8 Whr లిథియం పాలిమర్ బ్యాటరీ వుంది. 30W USB-C తో సపోర్ట్ వస్తుంది. అంతేకాదు, ఈ యాపిల్ బుక్ Apple Intelligence సపోర్ట్ తో కూడా వస్తుంది.
మ్యాక్ బుక్ ఎయిర్ లేటెస్ట్ macOS పై నడుస్తుంది. ఇందులో, Thunderbolt 4 (USB-C) పోర్ట్స్, USB 4, 3.5 mm హెడ్ ఫోన్ జాక్, డిస్ప్లే పోర్ట్ మరియు MagSafe 3 పోర్ట్ ఉన్నాయి.
Also Read: Jio Plan: జియో హాట్ స్టార్ తో పాటు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఇదే.!
మ్యాక్ బుక్ ఎయిర్ 13 ఇంచ్ (16GB + 256GB) ను రూ . 99,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే, హై ఎండ్ వేరియంట్ (24GB + 521GB) ను రూ. 13,9900 ధరతో లాంచ్ చేసింది. మ్యాక్ బుక్ ఎయిర్ 15 ఇంచ్ విషయానికి వస్తే, బేసిక్ (16GB + 256GB) ను రూ . 124,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ మ్యాక్ బుక్ ఎయిర్ Pre-order ఈరోజు నుంచి మొదలయ్యాయి మరియు సేల్ మాత్రం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.