మీ ఓటర్ కార్డు పోగొట్టుకున్నా సరే ఓటు వెయ్యొచ్చు..!

Updated on 21-Feb-2021
HIGHLIGHTS

ఓటు వేయాలంటే ఓటర్ కార్డు లేదా

ఓటర్ కార్డు కనిపించడం లేదా

ఓటరు కార్డు లేకుండా ఎలా తమ ఓటు వేయాలని తర్జన భర్జన పడుతుంటారు. కానీ, ఓటర్ కార్డు లేకున్నా సరే ఓటర్ లిస్ట్ లో మీ పేరుంటే మీ ఓటును వినియోగించునే అవకాశం వుంటుంది. ఇక విషయానికి వస్తే,  ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఓటరు కార్డు లేకున్నా సరే కొన్ని ఇతర ప్రభుత్వ ఆమోదిత ID కార్డును, చూపించి ఓటు వెయ్యవచ్చు .

వాస్తవానికి, ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓటరుకు అందించినటువంటి ఆమోదిత ఎలెక్ట్రోల్ ఫోటో ఐడెంటిటీ కార్డు(EPIC) అందరికి (Voter ID కార్డుగా సుపరిచితం) అవసరం. ఈ ఓటరు కార్డు లేకుండా ఓటు వేయడానికి పోలింగ్ బూతు లోపలికి అనుమతించరు. కానీ, ఇప్పుడు మీ ఓటరు కార్డు లేకున్నా సరే, ఈ కొత్త నిర్ణయంతో ఈ  క్రింది సూచించిన పత్రాలను చూపించి ఓటు వేయవచ్చు.

ఈ పత్రాలను చూపించి ఓటు వేయవచ్చు

1. ఆధార్ కార్డు

2. PAN కార్డు

3. డ్రైవింగ్ లైసెన్స్

4. బ్యాంకు అకౌంట్/ పోస్ట్ ఆఫీస్ యొక్క ఫోటో కూడిన ఆమోదిత పాస్ బుక్

5. ఫొటో తో కూడిన పెన్షన్ పత్రం

6.  MPs/MLAs/MLCs కోసం ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ID కార్డులు

7. NPR లో భాగంగా RGI ఇచ్చిన స్మార్ట్ కార్డు

8. కేంద్ర మరియు రాష్ట్ర ఉద్యోగులు మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల యొక్క ఆమోదిత సర్వీస్ ID కార్డు

9.  పాస్ పోర్ట్     

10. కార్మిక మంత్రిత్వ శాఖ పధకం నుండి పొందిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు                                                  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :