ఈ ట్రిక్స్ తెలిస్తే మీ స్మార్ట్‌ఫోన్ హాంగ్ సమస్యను ఇట్టే తీసెయ్యొచ్చు

Updated on 23-Feb-2021
HIGHLIGHTS

స్మార్ట్‌ఫోన్ హాంగ్ సమస్యతో బాధపడుతున్నారా?

ఫోన్ హ్యాంగ్ సమస్య ఎందుకు వస్తుందో

మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి అసలు కారణం.

స్మార్ట్‌ఫోన్ హాంగ్ సమస్యతో బాధపడుతున్నారా?  ఫోన్‌ హ్యాంగ్ సమస్య ఎందుకు వస్తుందో తెలిస్తే, ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో మీరు తెలుసుకోవచ్చు. చాలా చిన్న చిన్న టిప్స్ పాటించి మీ ఫోన్ హ్యాంగింగ్ సమస్యను సులభంగా తొలిగించవచ్చు. అందుకే, ఈరోజు మేము మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాము.

మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి అసలు కారణం తెలుసుకుందాం …

అనవసరమైన యాప్స్ కారణంకావచ్చు

మా ఫోన్‌లో చాలా యాప్స్ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చాలా అరుదుగా ఉపయోగించబడతాయి మరియు పనికిరాని అన్ని యాప్స్ మొబైల్‌లో  స్టోర్   చేయబడతాయి. ఒక స్మార్ట్ ‌ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అవ్వడానికి ఇదే పెద్ద కారణం. ఈ యాప్స్, ఫోన్ పర్ఫార్మెన్సును మరియు ర్యామ్ ని తింటాయి మరియు తెలియకుండానే ఈ యాప్స్ ఆటొమ్యాటిగ్గా అప్డేట్ అవుతుంటాయి. ఫలితంగా, ఫోన్ స్టోరేజి కూడా నిండిపోతుంది మరియు ఫోన్ సమస్య మరింత అధికమవుతుంది.

ఫోన్ అప్డేట్

ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి మరొక కారణం ఫోన్ అప్డేట్ గా లేకపోవడం. స్మార్ట్ ‌ఫోన్స్ ‌ఎల్లప్పుడూ అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ను ఉపయోగించాలి. ఫోన్‌లో ఏదైనా క్రొత్త అప్డేట్స్ ఉన్నాయా అని చూడటానికి ఫోన్ సెట్టింగ్స్ ఎంపికకు వెళ్లండి. ఫోన్ అప్‌డేట్ అయితే హ్యాంగ్ సమస్య కూడా తగ్గిపోతుంది .

ఫోన్ స్టోరేజ్

ఏదో ఒక సమయంలో మీ ఫోన్‌లో స్టోరేజ్ నిండుకునట్లు కనిపిస్తుంది. ఇలా జరిగితే,  Android ఫోన్ హ్యాక్  లేదా ఏదైనా ఫోన్‌తో ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము. కాబట్టి, ఫోన్ స్టోరేజిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. మీ ఫోన్‌లో ఉపయోగించని వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇది ఫోన్ హ్యాంగింగ్ సమస్యను తొలగిస్తుంది    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :