స్మార్ట్ పెన్ తో Xiaomi Pad 6 ను లాంచ్ చేస్తున్న షియోమి.!

HIGHLIGHTS

షియోమి ఇండియాలో కొత్త ప్యాడ్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ కొత్త ప్యాడ్ ను Xioami Pad 6 పేరుతో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ ప్యాడ్ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తోంది

షియోమి ఇండియాలో కొత్త ప్యాడ్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్యాడ్ ను Xioami Pad 6 పేరుతో స్మార్ట్ పెన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ ను జూన్ 13వ తేదీన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ మెంట్ చేయడంతో పాటుగా టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఈ షియోమి ప్యాడ్ 6 అమెజాన్ స్పెషల్ గా వస్తోంది మరియు ఈ ప్యాడ్ కోసం అమెజాన్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ మరియు బ్యానర్ పేజ్ ను కూడా అందించింది. 

Xioami Pad 6: టీజ్డ్ స్పెక్స్

షియోమి ఈ అప్ కమింగ్ ప్యాడ్ Xioami Pad 6 యొక్క కీలకమైన వివరాలను కూడా టీజింగ్ ద్వారా అందించింది. Xioami Pad 6 ను క్వాల్కమ్ యొక్క ఫాస్ట్ 5G ప్రోసెసర్ Snapdragon 870 SoC తో తీసుకు వస్తునట్లు షియోమి తెలిపింది. ఈ షియోమి ప్యాడ్ 6 చాలా సన్నగా మరియు తేలికగా ఉన్నట్లు మరియు కొలతలను కూడా రివీల్ చేసింది. ఈ ప్యాడ్ 6.51mm మందంతో చాలా సన్నగా మరియు 490 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని కంపెనీ టీజింగ్ ద్వారా సూచించింది. 

ఈ షియోమి ప్యాడ్ యొక్క మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్యాడ్ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తోందని కూడా షియోమి ప్రకటించింది. ఇందులో Xiaomi Smart Pen ఉన్నట్లు కూడా టీజింగ్ ఇమేజ్ ద్వారా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :