Xiaomi UniBlade Trimmer: ఆల్ ఇన్ వన్ ప్రయోజనాలతో కొత్త ట్రిమ్మర్ లాంచ్ చేసిన షియోమి.!

HIGHLIGHTS

షియోమి Xiaomi UniBlade Trimmer ను రిలీజ్ చేసింది

ఇది పేరుకు తగ్గుట్టుగానే UniBlade తో వస్తుంది

All-In-One Grooming Kit గా Xiaomi బ్రాండ్ ఈ UniBlade Trimmer తీసుకువచ్చినట్లు చెబుతోంది

Xiaomi UniBlade Trimmer: ఆల్ ఇన్ వన్ ప్రయోజనాలతో కొత్త ట్రిమ్మర్ లాంచ్ చేసిన షియోమి.!

భారత మార్కెట్ లో ఈరోజు ప్రముఖ చైనీస్ బ్రాండ్ షియోమి, Xiaomi UniBlade Trimmer ను రిలీజ్ చేసింది. ఇది పేరుకు తగ్గుట్టుగానే UniBlade తో వస్తుంది మరియు షేవింగ్ ట్రిమ్మింగ్ తో పాటుగా పొడవాటి గడ్డాన్ని కూడా సరి చేయగలిగే సత్తాను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది చూడటానికి చాలా సన్నగా మరియు చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. మగవారి అన్ని అవసరాలకు తగిన All-In-One Grooming Kit గా Xiaomi బ్రాండ్ ఈ UniBlade Trimmer తీసుకువచ్చినట్లు చెబుతోంది. ఈ లేటెస్ట్ ట్రిమ్మింగ్ ప్రత్యేతలు మరియు ధర వివరాలు ఏమిటో చూద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi UniBlade Trimmer price

Xiaomi UniBlade Trimmer ఇండియన్ మార్కెట్ లో రూ. 1,499 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది. షియోమి ఈ ట్రిమ్మర్ పైన snapmint తో అతి తక్కువ EMI అఫర్ ను కూడా అందించింది. ఈ ట్రిమ్మర్ ను mi.com, Amazon మరియు Flipkart నుండి మీరు కొనుగోలు చేయవచ్చు.

Aadhaar Card: 10 రోజుల్లో ముగియనున్న ఉచిత Aadhaar Update Service.!

 Xiaomi UniBlade Trimmer Features 

ఈ Xiaomi UniBlade Trimmer 3-Way పేషిషన్ షేవింగ్ హెడ్ తో వస్తుంది మరియు 14 రకాల కొలతల సెట్టింగ్ ను కూడా కలిగి వుంది. ఈ షియోమి ట్రిమ్మర్ షేవ్, ట్రిమ్ మరియు ఎడ్జ్ లను కూడా చాలా సునాయాసంగా నిర్వహించ గలదని షియోమి తెలిపింది. ఈ UniBlade Trimmer నీటిలో తడిసినా కూడా ఈ ట్రిమ్మర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పని చేస్తుంది. ఎందుకంటే, ఈ UniBlade Trimmer IPX7 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

ఈ షియోమి ట్రిమ్మర్ 600 mAh బ్యాటరీని Type-C యూనివర్సల్ చార్జింగ్ పోర్ట్ తో కలిగి వుంది. ఈ ట్రిమ్మర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నిముషాలు పని చేస్తుందని కంపెనీ తెలిపింది మరియు ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి 1.5 గంటల సమయం పడుతుంది. ఈ ట్రిమ్మర్ ట్రావెల్ లాక్, బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ మరియు మాట్టే డిజైన్ తో వస్తుంది. 

Realme C51 Launched: ప్రీమియం లుక్, ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP AI Camera తో లాంచ్.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo